తొలి అడుగు ముగిసింది

8 Dec, 2018 00:34 IST|Sakshi

డిసెంబర్‌ 7 (శుక్రవారం) జరిగిన తెలంగాణ ఎన్నికల్లో పలువురు టాలీవుడ్‌ సినీ సెలబ్రిటీలు తమ ఓటు  హక్కును వినియోగించుకుని ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఓటు హక్కును వినియోగించుకోలేకపోయినందుకు నిరుత్సాహపడ్డానని హీరో రామ్‌చరణ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పేర్కొన్నారు. చిరంజీవి, నాగార్జున, నాగబాబు, ఎన్టీఆర్‌ తమ కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓటు వేసేందుకు వచ్చిన ఎన్టీఆర్‌.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి సంబంధించిన లుక్‌ను రివీల్‌ చేసేశాడా అని అనుకుంటున్నారు.

ఎన్టీఆర్‌–రామ్‌చరణ్‌ల మధ్య జరుగుతున్న భారీ ఫైట్‌కు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఇది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలోని ఫైట్‌ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘బాహుబలి’ వంటి భారీ విజయం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. నవంబర్‌ 18న మొదలైన ఈ సినిమా తొలి షెడ్యూల్‌ కంప్లీట్‌ అయ్యింది. ‘‘తొలి షెడ్యూల్‌ పూర్తయింది. తర్వాతి చిత్రీకరణ వివరాలను అతి త్వరలో తెలియజేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ జనవరిలో ప్రారంభం అవుతుందని సమాచారం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఫస్ట్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌ చేసిన రామ్‌చరణ్‌ ‘వినయ విధేయ రామ’ సినిమాలోని సాంగ్స్‌ కోసం రెడీ అవుతున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్‌ చేయాలనుకుంటున్నారన్న సంగతి తెలిసిందే. సో.. ‘వినయ విధేయ రామ’ చిత్రీకరణ పూర్తి చేసిన తర్వాతే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్‌లో రామ్‌చరణ్‌ పాల్గొంటారని ఊహించవచ్చు. ఇక ఈ చిత్రానికి కథానాయికలుగా కీర్తీ సురేశ్, కియారా అద్వానీ సెలక్ట్‌ అయ్యారని, ‘రామరావణరాజ్యం’అనే టైటిల్‌ను ఫైనలైజ్‌ చేయాలని చిత్రబృందం ఆలోచిస్తోందని టాక్‌. ఈ సినిమా 2020లో రిలీజ్‌ కానుందట. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు