అభిమానులకు ఆర్‌ఆర్‌ఆర్‌ హీరోయిన్‌ విషెస్‌

2 Jan, 2020 10:48 IST|Sakshi

కొత్త సంవత్సరంలో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి ఈ పీరియాడికల్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్‌ సరసన ఇంగ్లిష్‌ నటి డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ నటిస్తారని గతంలో ప్రకటించినప్పటికీ చివరాఖరికి హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్‌ను చిత్రబృందం ఎంచుకుంది. ఈ సినిమా షూటింగ్‌ ఎనభై శాతానికి పైగా పూర్తి కావచ్చింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను పది భాషల్లో విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.

తాజాగా ఎన్టీఆర్‌ భామ ఒలీవిమా మోరిస్‌ తన అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఏడాది కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్‌ చేసింది. దీనికి ఆర్‌ఆర్‌ఆర్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఒలీవియో మోరిస్‌ను ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా హీరోయిన్‌గా ప్రకటించే సమయానికి కేవలం ఆమెకు 300 మంది ఫాలోవర్లే ఉండేవారు. ఎన్టీఆర్‌తో జోడీ కట్టే అదృష్టం ఒలీవియాకు దక్కిందనగానే నెటిజన్లు సోషల్‌ మీడియాలో ఆమె కోసం పెద్ద ఎత్తున గాలించారు. దీంతో ప్రస్తుతం ఆమె ఫాలోవర్ల సంఖ్య 22 వేలకు పైగా ఉండటం విశేషం.

మరిన్ని వార్తలు