‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో శ్రియ!

29 Jan, 2020 17:30 IST|Sakshi

ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు దాటిపోయింది. అయినప్పటికీ చెక్కుచెదరని అందంతో కుర్రకారుల మతులు పోగొడుతోంది హీరోయిన్‌ శ్రియ. దక్షిణాదిలో వరుస సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్‌ టాలీవుడ్‌లో కాస్త వెనకబడింది. అయితే శ్రియకు ఓ బంపరాఫర్‌ తగిలినట్లు సమాచారం. తెలుగులో భారీ బడ్జెట్‌తో, పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో నటించే చాన్స్‌ కొట్టేసిందంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవ్‌గన్‌కు జోడీగా చిత్రబృందం శ్రియను ఎంచుకున్నారు. దీంతో ఆమె షూటింగ్‌ కోసం గతవారం వికారాబాద్‌ అడవులకు పయనమైంది. అక్కడ అజయ్‌, శ్రియ జోడీపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారని ఆ వార్తల సారాంశం.

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రాంచరణ్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఇందులో ఎన్టీఆర్‌ సరసన ఒలీవియా మోరిస్, రాంచరణ్‌తో ఆలియా భట్‌ జోడీ కట్టనున్నారు. బాహుబలి వంటి అంతర్జాతీయ సినిమాలను తెరకెక్కించిన జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్‌కు దర్శకత్వం వహించడంతో ఈ చిత్రంపై అసాధారణ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు సంబంధించిన వివరాలను ఎంతో గోప్యంగా ఉంచడానికి చిత్రబృందం ఎంతగానో ప్రయత్నించినప్పటికీ హీరోల ఫొటోలు, సినిమా వివరాలు లీక్‌ అవుతూనే వచ్చాయి. దీంతో రాజమౌళి షూటింగ్‌ సెట్‌లో మొబైల్‌ ఫోన్లను నిషేధించినట్టు వినికిడి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 10 భాషల్లో విడుదల చేయనున్నారు.

చదవండి: 

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై క్లారిటీ ఇచ్చిన సుదీప్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు