‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఫస్ట్ అప్‌డేట్ అప్పుడే!

15 Feb, 2019 11:03 IST|Sakshi

బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ (వర్కింగ్‌ టైటిల్‌). ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ మల్టీస్టారర్‌లో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమా పిరియాడిక్‌ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుందన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు సినిమాకు సంబందించి హీరోలు సాంకేతిక నిపుణుల పేర్లు తప్ప ఎలాంటి అప్‌డేట్ బయటకు రాలేదు.

అయితే ఈ సినిమా ఫస్ట్ పోస్టర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌ అయ్యిందన్న టాక్‌ వినిపిస్తోంది. మార్చి 27న రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా సినిమాలో చరణ్‌ లుక్‌ను రివీల్ చేయనున్నాడట జక్కన్న. బాహుబలి సమయంలోనూ తారల పుట్టిన రోజు కానుకగా పోస్టర్స్‌ రిలీజ్ చేసిన రాజమౌళి ఈ సారి కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ఈ సినిమాలో చరణ్ బ్రిటీష్‌ ప్రభుత్వంలో పనిచేసే పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అది నిజమో కాదో తెలియాలంటే అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ వరకు వెయిట్ చేయాల్సిందే.

మరిన్ని వార్తలు