నిహారికకు ఏమైంది?

9 Jun, 2016 14:31 IST|Sakshi
నిహారికకు ఏమైంది?

మెగా వారసురాలుగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కావడానికి సిద్ధమవుతోంది నిహారిక. రామరాజు దర్శకత్వంలో 'ఒక మనసు' అనే అందమైన ప్రేమ కథలో హీరోయిన్ గా కనిపిస్తుంది నాగబాబు ముద్దుల తనయ. ఈ మధ్యే అట్టహాసంగా ఆ సినిమా ఆడియో రిలీజ్ జరుపుకుంది. నిహారికకు జంటగా నాగశౌర్య నటించాడు. జూన్ 24న సినిమా రిలీజ్ డేట్ అనుకున్నారు. అందుకు తగ్గట్లే పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేస్తున్నారు. త్వరలో ప్రమోషన్ హంగామా మొదలు పెట్టాలనుకుంటున్నారు దర్శకనిర్మాతలు. అయితే ఇక్కడే అసలు సమస్య వస్తోంది చిత్ర యూనిట్కి.

టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ...షూటింగ్ ముగిసిన తర్వాత నిహారిక ఎందుకో ఈ సినిమా యూనిట్ కి దూరంగా ఉంటూ వస్తోందంట. మొదట విడుదల చేసిన ట్రైలర్ కి డబ్బింగ్ చెప్పడానికి కూడా నిహారిక చాలా టైమ్ తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు సినిమా డబ్బింగ్ విషయంలో కూడా అదే సమస్యను ఎదుర్కొంటుందట చిత్ర యూనిట్. ఈ సినిమా డబ్బింగ్కి ఎప్పుడు రమ్మని పిలిచినా ... నిహారిక ఏదో వంక చెప్పి  తప్పించుకోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందిప్పుడు.

మెగా డాటర్ ఇమేజ్ తో తమ సినిమాకు మరింత మైలేజీ వస్తుందన్న దర్శక నిర్మాతల ఆశలను.. నిహారిక వ్యవహరిస్తున్న తీరు డిసప్పాయింట్ చేస్తోందని సమాచారం. మరికొద్ది రోజులు ఆగి .. నిహారిక డబ్బింగ్ కి రాకపోతే కనుక.. మరో డబ్బింగ్ ఆర్టిస్ట్ తో వాయిస్ చెప్పించాలని డిసైడ్ అయ్యారట. అయితే ఆ రూమర్లపై నిహారిక కూడా ఇంతవరకూ స్పందించలేదు.