‘ఇట్స్‌ రియల్లీ షాకింగ్‌ అండ్‌ అన్‌బిలీవబుల్’

2 Feb, 2020 12:22 IST|Sakshi

రూపేశ్‌కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా జంటగా తెరకెక్కుతున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘22’. మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై సుశీలాదేవి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివకుమార్‌ బి దర్శకునిగా పరిచయమవుతున్నారు. విభిన్న టైటిల్‌కు తోడు ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ ఈ చిత్రంపై అందరి దృష్టి పడేలా చేసింది. తాజాగా మూవీ టీజర్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. సినిమా ఎలా ఉండబోతోందో టీజర్‌ రూపంలో చెప్పే ప్రయత్నం చేసింది చిత్ర యూనిట్‌. పుల్‌ అండ్‌ ఫుల్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఈ చిత్రంలో ఉండేలా కనిపిస్తోంది. 

ప్రస్తుతం ఈ టీజర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఓ సీరియస్‌ కేస్‌ను ఇన్వెస్టిగేట్‌ చేస్తున్న సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ గెటప్‌లో రూపేశ్‌ చాలా చక్కగా ఒదిగిపోయినట్టు కనిపిస్తోంది. ‘ఈ ఏటీఎమ్‌కు వచ్చి ఎవరెవరు బాధపడుతున్నారో వాళ్లకే ఇలా జరుగుతుంది’అనే బ్యాగ్రౌండ్‌ డైలాగ్‌తో మొదలైన టీజర్‌ 87 సెకన్ల పాటు ఉత్కంఠగా సాగింది. ఇక చివర్లో హీరోహీరోయిన్లు కూల్‌గా బైక్‌పై వెళ్లే సీన్‌తో టీజర్‌ ముగుస్తుంది. పూజా రామచంద్రన్, శరణ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్‌ సంగీతమందిస్తున్నాడు. 

చదవండి:
‘ప్రదీప్‌’ పాటకు నెటిజన్లు ఫిదా

‘అమలాపాల్‌-విజయ్‌ విడిపోడానికి అతడే!’

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా