‘ఆర్‌ఎక్స్‌ 100’ దర్శకుడికి కాస్ట్‌లీ గిఫ్ట్‌

11 Aug, 2018 12:38 IST|Sakshi

ఇటీవల సంచలన విజయం సాధించిన చిన్న సినిమా ఆర్‌ఎక్స్‌100. ఈ సినిమాతో దర్శకుడు అజయ్‌ భూపతి టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాడు. బోల్డ్ కంటెంట్‌ తో తెరకెక్కిన ఆర్‌ఎక్స్‌ 100 మంచి విజయం సాధించటమే కాదు నిర్మాతకు కాసుల పంట పండించింది. అందుకే తనకు ఇంతటి ఘన విజయాన్ని అందించిన దర్శకుడికి నిర్మాత అశోక్‌ గుమ్మకొండ ఓ కాస్ట్‌లీ బహుమతి ఇచ్చారు.

అజయ్‌ భూపతికి జీప్ కంపెనీ కారును అందించారు. కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌లు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఆర్‌ఎక్స్‌ 100 సినిమాలో రావూ రమేష్‌. రాంఖీలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. చైతన్య భరద్వాజ్‌ సంగీతమందించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు