‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫస్ట్‌లుక్‌

7 Apr, 2018 10:28 IST|Sakshi
ఆర్‌ఎక్స్‌ 100 ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌

కార్తికేయ, పాయల్ రాజ్‌పుట్‌  హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఆర్‌ఎక్స్‌ 100 (RX 100). ప్రస్తుతం నిర్మాణాంతరకార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు. ఈ సినిమాతో రామ్‌ గోపాల్‌ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కేసీడబ్ల్యూ బ్యానర్ పై  జి. అశోక్ రెడ్డి తొలి ప్రయత్నంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

సీనియర్‌ నటులు రావురమేష్, సింధూర పువ్వు రాంఖీ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను భావోద్వేగాలతో కూడిన సహజమైన ప్రేమకథగా తెరకెక్కిస్తున్నట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. కబాలి సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవటంతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకు ప్రవీణ్‌ కే ఎల్‌ ఈ సినిమాకు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయన చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావటం విశేషం. జూన్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు