ఆర్‌డీఎక్స్‌ షురూ

1 Apr, 2019 00:06 IST|Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్, ‘ఆవకాయ బిర్యానీ, హుషారు’ ఫేమ్‌ తేజస్‌ జంటగా శంకర్‌ భాను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌డీఎక్స్‌’. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం సమర్పణలో హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా విజయవాడ కె.ఎల్‌.యూనివర్సిటీలో ఆదివారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఆంధ్రప్రదేశ్‌ ఎఫ్‌డీసీ చైర్మన్‌ అంబికాకృష్ణ క్లాప్‌ ఇవ్వగా, విజయవాడ అర్బన్‌ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న కెమెరా స్విచ్చాన్‌ చేయగా, సి.కల్యాణ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం సి.కల్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘పవర్‌ఫుల్‌ లేడీ ఓరియంటెడ్‌ సబ్జెక్ట్‌ ఇది. రెగ్యులర్‌ షూటింగ్‌ను ఆదివారం నుంచే ప్రారంభిస్తున్నాం.

విజయవాడలో 4 రోజులు, తర్వాత పోలవరం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా 40 రోజులు షూటింగ్‌ చేస్తాం. సినిమా చిత్రీకరణ అంతా ఆంధప్రదేశ్‌లోనే పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత మరో పవర్‌ఫుల్‌ పాత్ర చేస్తున్నా. ఇది లేడీ ఓరియంటెడ్‌ సబ్జెక్ట్‌. ఇలాంటి పాత్ర చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అన్నారు పాయల్‌ రాజ్‌పుత్‌. ‘‘అద్భుతమైన కథ ఇది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. అనుకున్న ప్లానింగ్‌ ప్రకారం సినిమాను పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు శంకర్‌ భాను. నరేష్‌ వి.కె, నాగినీడు, ఆదిత్య మీనన్, ఆమని, తులసి, ఐశ్వర్య తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : రధ¯Œ , కెమెరా: సి.రాంప్రసాద్‌.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు