స్టార్‌ హీరో బర్త్‌ డే: ఆటపట్టించిన భార్య!

25 Oct, 2019 12:36 IST|Sakshi

హాలీవుడ్‌ ‘డెడ్‌పూల్‌’ సినిమా హీరో ర్యాన్‌ రెనాల్డో పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, సన్నిహితులు సహా ఎంతో మంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే వాటన్నింటిలో ర్యాన్‌ భార్య బ్లేక్ లైవ్లీ తెలిపిన విషెస్‌ ప్రత్యేకంగా నిలిచాయి. తామిద్దరం కలిసిన ఉన్న ఫోటోకి బ్లేక్‌ జత చేసిన ట్యాగ్‌ నవ్వులు పూయిస్తోంది. బ్లేక్‌ తన భర్త ర్యాన్‌ ముక్కు దగ్గర వేలు పెడుతూ ఉన్న ఫోటోకి ‘ఉత్తమమైనదే నేను ఎంచుకున్నాను, హ్యాపీ బర్త్‌ డే ర్యాన్‌’ అంటూ సరదా క్యాప్షన్‌ జతచేశారు. బ్లేక్‌ షేర్‌ చేసిన ఈ ఫోటోకి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఒక్కరోజులోనే 40 మిలియన్ల లైక్‌లు కొట్టి ఆమెపై అభిమానం చాటుకున్నారు. 

I picked a good one. Happy birthday @vancityreynolds 🎈

A post shared by Blake Lively (@blakelively) on

ఈ పోస్ట్‌ చూసిన బ్లేక్‌ సోదరి ‘క్రస్టీ వన్‌ ఆల్‌రైట్‌’  అంటూ ఆకుపచ్చ హార్ట్‌ ఎమోజీతో సరదాగా కామెంట్‌ చేసింది. అలాగే ర్యాన్‌తో కలిసి ‘హిట్‌మ్యాన్స్‌ బాడిగార్డ్‌’ మూవీలో నటించిన సల్మా హాయక్‌ కూడా ర్యాన్‌ను తన భార్య బ్లేక్‌ తరహాలోనే ఆటపట్టించింది.  ఇక హాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌గా పేరొందిన ర్యాన్‌ , బ్లేక్‌లు 2012లో ప్రేమ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Yes, Ryan, I am using your birthday to post this picture where I don’t look so bad, while you look all beat up, and also I’d like to take this opportunity to remind you that you were gonna send me some Aviation gin for MY birthday AND THAT WAS ALMOST TWO MONTHS AGO... If you want to see more picture of yourself, please look at my stories... oh and Happy Birthday by the way. Sí, Ryan, estoy usando tu cumpleaños para publicar esta foto en la que no me veo tan mal, mientras tu te ves golpeadisimo, y también quiero aprovechar esta oportunidad para recordarte que me ibas a mandar unas botellas de tu ginebra “Aviation” para mi cumpleaños y que fue hace casi dos meses! Si quieres ver más fotos tuyas checa mis historias. Ah y por cierto, feliz cumpleaños. @vancityreynolds #aviationgin @aviationgin 📸 @samanthalopezs

A post shared by Salma Hayek Pinault (@salmahayek) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా