'ఎస్ 3 (యముడు 3)' మూవీ రివ్యూ

10 Feb, 2017 12:47 IST|Sakshi
'ఎస్ 3 (యముడు 3)' మూవీ రివ్యూ

టైటిల్ : ఎస్ 3 (యముడు 3)
జానర్ : యాక్షన్ డ్రామా
తారాగణం : సూర్య, అనుష్క, శృతిహాసన్, థాకూర్ అనూప్ సింగ్, శరత్ సక్సెనా
సంగీతం : హారిస్ జయరాజ్
దర్శకత్వం : హరి
నిర్మాత : జ్ఞానవేల్ రాజా

యముడు(సింగం), సింగం (యముడు 2) సినిమాలతో ఘనవిజయాలు సాధించిన సూర్య, అదే సీరీస్ లో మూడో భాగం ఎస్ 3తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలి రెండు భాగాలకు మించిన స్పీడుతో అంతకు మించిన భారీ యాక్షన్ ఎపిసోడ్స్తో తెరకెక్కిన సింగం 3 ఎన్నో అవాంతరాలు, వాయిదాల తరువాత గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మూడో భాగంతో సూర్య తన స్పీడు కంటిన్యూ చేశాడా..? సింగం సక్సెస్ ట్రాక్ కంటిన్యూ అయ్యిందా..?

కథ :
కర్ణాటకలో జరిగిన ఓ కమిషనర్ హత్య కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు ఎలాంటి క్లూ సాధించలేకపోతారు. దీంతో ఆ కేసును డీల్ చేయడానికి ఓ పవర్ ఫుల్ ఆఫీసర్కు కేసును అప్పగించాలని నిర్ణయిస్తారు. పురుషోత్తమ్, భాయ్, డానీ లాంటి నేరస్తుల ఆటకట్టించిన ఆంధ్రా పోలీస్ నరసింహం (సూర్య) అయితేనే ఈ కేసును సాల్వ్ చేయగలడని, సిబిఐ ద్వారా కర్ణాటకలో అపాయింట్ చేస్తారు. అప్పటికే మంగుళూరు సిటీని తన కంట్రోల్లో పెట్టుకొని ఎన్నో నేరాలు చేస్తున్న ఎంఎస్ రెడ్డి అలియాస్ మదుసూధన్ రెడ్డి (శరత్ సక్సెనా) గురించి తెలుసుకొని కమీషనర్ హత్యకు ఎంఎస్ రెడ్డికి సంబంధం ఉందని అనుమానిస్తాడు.

ఆ విషయాలు తెలుసుకోవడానికి ఎంఎస్ రెడ్డి మనుషులతో సన్నిహితంగా ఉంటున్నట్టు నటిస్తాడు నరసింహం. ఈ విషయం గురించి ఇన్వెస్టిగెటివ్ జర్నలిస్ట్ అగ్ని అలియాస్ విద్య (శృతి హాసన్) కర్ణాటక టుడేలో అవినీతి ఆఫీసర్ అంటూ ఆర్టికల్ రాస్తుంది. నరసింహం అనుకున్నట్టుగానే కమీషనర్ హత్య వెనుక ఎంఎస్ రెడ్డి ఉన్నాడని తెలుసుకుంటాడు. కానీ ఇంత పకడ్బందిగా హత్య చేసేంత తెలివి ఎంఎస్ రెడ్డికి లేదని అతని వెనుక ఇంకా ఎదో పెద్ద పవర్ ఉందన్నఅనుమానం కలుగుతుంది.

విఠల్ ప్రసాద్ (థాకూర్ అనూప్ సింగ్) సెంట్రల్ మినిస్టర్ రామ్ ప్రసాద్ (సుమన్) కొడుకు. తండ్రి అండతో ఆస్ట్రేలియాలో ఉంటూ అక్కడి స్క్రాప్ను ఇండియాకు డంప్ చేసే బిజినెస్ చేస్తుంటాడు. మంగుళూరులో జరిగే ఎన్నో నేరాలకు విఠలే కారణం అని తెలుసుకున్న నరసింహం.. ఆస్ట్రేలియా నుంచి విఠల్ను ఇండియా ఎలా రప్పించాడు. చివరకు విఠల్ ఆట ఎలా కట్టించాడు అన్నదే మిగతా కథ.

నటీనటులు :
తొలి రెండు భాగాల్లో పవర్ ఫుల్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్న సూర్య మరోసారి తన పవర్ ఫ్యాక్డ్ ఎనర్జీతో అలరించాడు. పదుల సంఖ్యలో క్యారెక్టర్స్ వచ్చిపోతున్నా సినిమా అంతా వన్ మేన్ షో అనిపించేలా ఎనర్జిటిక్ యాక్టింగ్తో సినిమాకు మరింత ఎనర్జి అందించాడు. తొలి రెండు భాగాల్లో సింగం ప్రియురాలి కనిపించిన అనుష్క ఈ సినిమాలో భార్యగా కనిపించింది. కాస్త బొద్దుగా ఉన్నఅనుష్కను చూసి అభిమానులు నిరాశపడినా గ్లామర్ తోనూ ఆకట్టుకుంది. జర్నలిస్ట్ పాత్రలో కనిపించిన శృతిహాసన్ తనదైన నటనతో మెప్పించింది. స్టైలిష్ విలన్గా థాకూర్ అనూప్ సింగ్ నటన బాగుంది. ఇతర పాత్రల్లో శరత్ సక్సెనా, రాధికా శరత్ కుమార్, శరత్ బాబు, సుమన్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు :
సూర్య మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించిన దర్శకుడు మరోసారి సూర్యలోని ఎనర్జికి తగ్గ పవర్ ఫుల్ పాత్రను డిజైన్ చేశాడు. సింగం సీరీస్ లోని తొలి రెండు భాగాలను మించిన స్పీడుతో ఈసారి సూర్యను యూనివర్సల్ కాప్గా చూపించాడు. సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కాస్త లాజిక్లను పక్కన పెట్టిన దర్శకుడు ఏ మూమెంట్ లోనూ సినిమా స్లో అవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే తొలి రెండు భాగాలకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్లస్ అయ్యింది. కానీ మూడో భాగానికి దేవిని పక్కన పెట్టి హారిస్ జయరాజ్ను తీసుకోవటం అంతగా వర్క్ అవుట్ కాలేదు. హారిస్ జయరాజ్ నేపథ్య సంగీతంతో పరవాలేదనిపించినా.. పాటల విషయంలో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు.ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
సూర్య నటన
స్క్రీన్ ప్లే
యాక్షన్ ఎపిసోడ్స్

మైనస్ పాయింట్స్ :
పాటలు
సినిమా లెంగ్త్

ఓవరాల్గా ఎస్ 3 (యముడు 3) పవర్ ప్యాక్డ్ పోలీస్ యాక్షన్ డ్రామా.. సింగం జోరు కొనసాగుతోంది...

- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్