‘సాహో’ సంగీత దర్శకుడిపై దాడి

31 Jul, 2019 16:11 IST|Sakshi

మోస్ట్ అవెయిటెడ్‌ మూవీ సాహో సినిమాలోని ఒక్కో పాటకు ఒక్కో సంగీత దర్శకుడు పనిచేశాడు. తొలి పాటకు తనిష్క్‌ బాగ్చి స్వరాలందించటంతో పాటు ఆలపించారు. ఇటీవల విడుదలైన ఏ చోట నువ్వున్నా టీజర్‌లోని పాటకు గురు రంథవ సంగీతమందించి ఆలపించారు. ఈ పాట ఆగస్టు 2న రిలీజ్ కానుంది. అయితే అంతకన్నా ముందే సంగీత దర్శకుడు గురు వార్తల్లో నిలిచారు.

ఇటీవల గురు అమెరికా, కెనాడలలో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. చివరగా వాన్‌కోర్‌లో ప్రదర్శన సందర్భంగా జరిగిన గొడవలో గురు గాయపడ్డాడు. తాను స్టేజ్‌ మీద పర్ఫామ్‌ చేస్తున్న సమయంలో ఓ పంజాబీ వ్యక్తి స్టేజ్‌ మీదకు వచ్చే ప్రయత్నం చేశాడని, అతడిని వద్దని వారించటంతో ప్రొగ్రామ్‌ అయిపోయి తిరిగి వెళ్లే సమయంలో తనపై దాడి చేశారని గురు తన సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు. ఈ దాడిలో గురుకు కంటి పై భాగంలో తీవ్రగాయం కావటంతో నాలుగు కుట్లు పడ్డాయి. ఇండియా తిరిగి వచ్చిన గురు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.

Guru is back in India with four stitches on his right eyebrow and mega successful USA/Canada tour. The incident happened on 28th July in Vancouver when Guru told one punjabi man not to come on stage while he was performing for the audience. That man was trying to come on stage again and again and then he started fighting with everyone backstage. He was known to the local promoter Surinder Sanghera who sent him away during the show. But at the end when Guru finished the show and was leaving the stage, that punjabi man came and hit him hard on his face with a punch , because of which Guru started bleeding on the spot from his forehead above eyebrow and went back to stage and showed it to the audience. That man was with few others and whosoever tried to stopped them, they were punching them and then they all ran away. Guru is home now feeling safe in India. And Guru Said , his Guru Nanak Dev ji has saved him and prayed to Waheguru to give that man a good sense of understanding what to do and what not to. Your love and support is all we need always. Thanks Management Guru Randhawa

A post shared by Guru Randhawa (@gururandhawa) on

మరిన్ని వార్తలు