సాహో.. ‘సైకో సయ్యా’ సాంగ్‌ టీజర్‌

5 Jul, 2019 10:16 IST|Sakshi

అంతర్జాతీయ స్థాయి యాక్షన్‌ అడ్వంచరస్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘సాహో’. బాహుబలి వంటి బిగ్గెస్ట్‌ హిట్‌ తర్వాత ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో ఇప్పటికే టీజర్‌తో వావ్‌ అనిపించిన సాహో టీం.. తాజాగా ఓ సాంగ్‌ టీజర్‌ను నాలుగు(తెలుగు, తమిళ, హిందీ, మలయాళం) భాషల్లో విడుదల చేసింది. సైకో సయ్యా అంటూ సాగే ఈ పాటలో ప్రభాస్‌, శ్రద్ధ లుక్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఇక ఈ పూర్తి పాటను జూలై 8న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

కాగా ఈ సినిమాకు సంగీత దర్శకులుగా ముందు శంకర్‌ ఇషాన్‌ లాయ్‌లను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ సంగీత త్రయం సాహో నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. శంకర్‌ ఇషాన్‌ లాయ్‌లు తప్పుకున్న విషయాన్ని దృవీకరించిన సాహో టీం సంగీత బాధ్యతలు ఎవరికి అప్పగించారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

ఇక ప్రభాస్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్ దర్శకుడు. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. బాలీవుడ్ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌ విలన్‌గా నటిసస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్, కోలీవుడ్‌లకు చెందిన ప్రముఖ నటులు నటింస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టు 15న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు