పోకిరి పోలీస్‌

16 Sep, 2018 00:28 IST|Sakshi
విక్రమ్, కీర్తి

విక్రమ్‌ హీరోగా హరి దర్శకత్వంలో తమిళంలో రూపొందిన సినిమా ‘సామీ స్క్వేర్‌’. కీర్తీ సురేశ్, ఐశ్వర్యా రాజేష్‌ కథానాయికలుగా నటించారు. బాబీ సింహా, ప్రభు గణేశన్‌ కీలక పాత్రలు చేశారు. దాదాపు పదిహేనేళ్ల క్రితం హరి–విక్రమ్‌ కాంబినేషన్‌లోనే రూపొందిన సూపర్‌ హిట్‌ మూవీ ‘సామీ’కి ఇది సీక్వెల్‌. ఇప్పుడీ సినిమాను నిర్మాతలు బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్‌ తెలుగులో ‘సామి’ పేరుతో ఈ నెల 21న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది.

ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. విక్రమ్‌గారి నటవిశ్వ రూపం ఇందులో కనిపిస్తుంది. హరి సినిమాలే ఎక్కువగా మాట్లాడతాయి. ఆయన తక్కువ మాట్లాడతారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు. ట్రైలర్‌లో ‘నేను పోలీస్‌ కాదు పోకిరి’ అని విక్రమ్‌ చెప్పే డైలాగ్‌ను బట్టి ఈ సినిమా ఎక్కువగా మాస్‌ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అవుతుందని టాక్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా