అతిపెద్ద ప్ర‌యోగం అది: తాప్సీ

14 Jul, 2020 15:18 IST|Sakshi

బాలీవుడ్‌లో హీరోయిన్ తాప్సీ స‌త్తా చాటుతుంది. న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌లు చేస్తూ త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది ఈ ఢిల్లీ బ్యూటీ. గ‌తేడాది విడుద‌లైన ‘సాంఢ్ కీ ఆంఖ్’​ సినిమాకి సంబంధించి ఫ‌స్ట్ ట్రయల్​ లుక్​ను సోష‌ల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ సినిమా త‌న‌కెంతో ప్ర‌త్యేక‌మ‌ని, త‌న‌కెన్నో మ‌ధుర‌మైన ఙ్ఞాప‌కాలు ఉన్నాయంటూ తెలిపింది.  “నా కెరీర్​లోనే నేను చేసిన అతిపెద్ద ప్ర‌యోగం ఇది. మొద‌టిసారి డైరెక్టర్​గా తుషార్ హీరా​నందాని​, తొలిసారి నిర్మాతగా నిధి పార్మర్హిరా, ఇక కెరీర్​లోనే మొద‌టిసారి ఇద్దరు నటీమణులు తమ వయసుకు మించిన పాత్రల్లో నటించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ సినిమాలో ఎంతోమంది మొద‌టిసారిగా బాలీవుడ్ స్ర్కీన్‌పై త‌మ అదృష్టం ప‌రీక్షించుకున్నారు. ఈ సినిమాతో నాకెన్నో మ‌ధుర‌మైన ఙ్ఞాప‌కాలు ఉన్నాయి అంటూ ఎమోష‌నల్ అయ్యింది. 

The first look trial for #SaandKiAankh The first biggest experiment of my career, the first time director (our over enthu teddy ) @tusharhiranandani , first time producer @nidhiparmarhira and probably the first time 2 female actors in the prime of their career decided to depict Twice their age to share an equal screen space in a story never told before! Too many firsts in this one n I guess the beginner’s luck worked. Too many stories n memories attached with this one ❤️ #SaandKiAankh #Archive #QuarantinePost #Throwback

A post shared by Taapsee Pannu (@taapsee) on

దాదాపు 30కి పైగా జాతీయ ఛాంపియ‌న్‌షిప్ పోటీల్లో పాల్గొన్న భార‌త మాజీ షూట‌ర్లు చంద్రో తోమ‌ర్, ప్ర‌కాశి తోమ‌ర్ల జీవిత‌క‌థ ఆధారంగా  ‘సాంఢ్ కీ ఆంఖ్’​ సినిమా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఇక ప్ర‌కాశి తోమ‌ర్ పాత్ర‌లో తాప్సి న‌టించ‌గా, భూమి ఫెడ్నేక‌ర్ చంద్రో తోమ‌ర్ పాత్ర‌ను పోషించారు. 2019 అక్టోబ‌ర్‌లో విడుద‌లైన ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంసలు సైతం అందుకుంది.  (నెక్ట్స్ షారుక్‌‌‌ నేనే అనుకున్నా.. కానీ: నటుడు)


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా