డ‌బ్బులు లేక న‌టి రాఖీల అమ్మ‌కం

23 Jul, 2020 12:11 IST|Sakshi
న‌టి వంద‌న విత్లానీ (ఫొటోలో ఎడ‌మ వైపు)

లాక్‌డౌన్ క‌ష్టాలు ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌ట్లేదు. ముఖ్యంగా కేవ‌లం న‌ట‌న‌పైనే ఆధార‌ప‌డ్డ వారి బ‌తుకులు మ‌రింత విషాదంగా మారాయి. ఈ క్ర‌మంలో ఓ న‌టుడు పండ్లు అమ్ముతూ క‌నిపించ‌గా తాజాగా ఓ న‌టి రాఖీలు అమ్ముకుంటున్నారు. "సాథ్ నిభానా సాథియా" సీరియ‌ల్ ‌(కోడ‌లా కోడ‌లా కొడుకు పెళ్లామా)తో పాపులారిటీ సంపాదించుకున్న విద్యా విత్లానీ చివ‌రిగా 'హ‌మారి బ‌హు సిల్క్' సీరియ‌ల్‌లో న‌టించారు. కానీ దానికి సంబంధించి ఇంత‌వ‌ర‌కూ నిర్మాత‌లు ఒక్క పైసా కూడా చెల్లించ‌లేదు. ఈ విష‌యాన్ని ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. నేను గ‌తేడాది మే నుంచి అక్టోబ‌ర్ వ‌ర‌కు షూటింగ్‌లో పాల్గొన్నాను. ల‌క్ష‌ల రూపాయ‌లు రావాల్సి ఉంది. సంవ‌త్స‌రం గ‌డుస్తున్నా ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క పైసా చెల్లించ‌లేదు, నేను దాచుకున్న డ‌బ్బు మొత్తం అయిపోయింది" (‘నటించమని ఎవరూ బెదిరించలేదు కదా’)


"గ‌తేడాది చివ‌ర్లో 'ముస్కాన్'‌లో న‌టించాను. ఆ డ‌బ్బులు ఇచ్చారు. కానీ అవి ఎన్ని రోజులు వ‌స్తాయి? అందుకే రాఖీలు త‌యారు చేస్తూ వాటిని ఆన్‌లైన్‌లో అమ్ముకుంటూ కొంత డ‌బ్బు సంపాదిస్తున్నా. దీనివ‌ల్ల ఎక్కువ‌ ఆదాయ‌మేమీ రాదు. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితిలో ఈ మాత్రం చేసుకోవ‌డ‌మైనా మంచిదే"న‌ని పేర్కొన్నారు. త‌న భ‌ర్త విపుల్ కూడా న‌టుడేన‌ని, క‌రోనా వ‌ల్ల అత‌ని ప‌నికి గండి ప‌డింద‌ని తెలిపారు. కాగా "హ‌మారి బ‌హు సిల్క్" సీరియ‌ల్ న‌టుడు జాన్ ఖాన్ సైతం నిర్మాత‌లు త‌మ‌కు డ‌బ్బులు చెల్లించ‌డం లేదంటూ గ‌తంలో సోష‌ల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. (ఓటీటీలో కాజల్‌ చిత్రం)

మరిన్ని వార్తలు