వివాదాస్పద పోస్ట్‌.. విపరీతమైన ట్రోలింగ్‌

6 Jul, 2019 16:22 IST|Sakshi

ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతిగా అలంకరించుకునే మహిళలు అంతరంగంలో ఎంతో వేదన అనుభవిస్తుంటారని ఓ పోస్ట్‌ చేశారు. దీని పట్ల నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి 19వ శతాబ్దం నాటి పనికిమాలిన సూక్తులు చెప్పకండి.. అప్పటి వారికి మహిళలను అర్థం చేసుకునేంత బుర్ర లేదు.. ఇది 21వ శతాబ్దం. మీ కస్టమర్లలో ఎక్కువగా ఉంది మహిళలే ఆ విషయం గుర్తు పెట్టుకొండి అంటూ మండి పడుతున్నారు.

ఇంతకు ఆ పోస్ట్‌లో ఏం ఉందంటే.. ఏ మహిళైనా అతిగా అలంకరించుకుని ఉందంటే.. ఆమె గాయపడినట్లు. లోలోన ఆమె మౌనంగా చాలా బాధపడుతుంది. కానీ ప్రపంచం దృష్టిలో తన గౌరవాన్ని, మర్యాదను కాపాడుకోవడం కోసం ఇలాంటి మెరుపులను ధరిస్తుంది. కానీ ఆమె అంతరంగం ఎంతో చీకటిగా, బాధతో నిండి ఉంటుంది. అలాంటి వారిని గమనిస్తే.. మీ విలువైన సమయంలో కొంత ఆమె కోసం కేటాయించండి.. మీ ప్రేమతో వారిని ఓదార్చండి.. ఎందుకంటే కొన్నిసార్లు స్పర్శకు మించింది ఏమి లేదు’ అంటూ సబ్యసాచి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దీన్ని సమర్థిస్తూ.. ఓ ప్రఖ్యాత రచయిత లైన్స్‌ను కూడా కోట్‌ చేశారు.
 

#Sabyasachi #ParadiseLost #SabyasachiJewelry #TheWorldOfSabyasachi @sabyasachijewelry

A post shared by Sabyasachi Mukherjee (@sabyasachiofficial) on

అయితే ఈ పోస్ట్‌ పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడంబరమైన దుస్తులు, నగలు డిజైన్‌ చేసే మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. మీ దుస్తులు ధరించే వారంతా బాధపడుతున్నట్లేనా అని ప్రశ్నిస్తున్నారు. మీ దుస్తులు అమ్మకాల కోసం ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ను ప్లే చేయకండి అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని వార్తలు