థ్రిల్‌ చేస్తుంది

1 Feb, 2019 02:14 IST|Sakshi
తుమ్మలపల్లి రామసత్యనారాయణ

సాగర్‌ శైలేష్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రహస్యం’. శ్రీ రితిక కథానాయికగా. ‘జబర్దస్త్‌’ అప్పారావు ముఖ్య పాత్ర చేశారు. భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘చిన్న బడ్జెట్‌ చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ లేదని, థియేటర్‌లు దొరకటం లేదని అంటుంటారు. ఇందులో కొంత వాస్తవం ఉన్నా పూర్తిగా కాదు. చిన్న సినిమాల్లో ఎన్నో చిత్రాలు బాగా  ఆడుతున్నాయి. మంచి చిత్రాలకు థియేటర్స్‌ దొరుకుతున్నాయి. అందుకు నేను నిర్మించిన చిన్న చిత్రాలే ఉదాహరణ. కొత్త తరహా కథాంశంతో, థ్రిల్లింగ్‌ అంశాలతో రూపొందిన చిత్రమిది. సాగర్‌ హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా చక్కని ప్రతిభ కనబర్చారు. ఇటీవల విడుదల చేసిన పాటలకు, టీజర్లకు స్పందన బాగుంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు