ఖల్‌నాయక్‌ ఈజ్‌ బ్యాక్‌

1 Jul, 2018 12:07 IST|Sakshi

సీనియర్‌ నటుడు సంజయ్‌ దత్‌ కాస్త గ్యాప్‌తో నటించిన చిత్రం సాహెబ్‌ బీవీ ఔర్‌ గ్యాంగ్‌స్టర్‌-3. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. టిగ్మాన్షూ ధూల్హియా డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూడో సిరీస్‌లో జిమ్మీ షెయిర్‌గిల్‌, మహి గిల్‌, సంజయ్‌ దత్‌, చిత్రాంగద సింగ్‌ కీలకపాత్రలు పోషించారు. రాయల్‌ సాహెబ్‌గా షెయిర్‌గిల్‌, బీవీగా మహి, ఇక ఇప్పుడు అదనంగా గ్యాంగ్‌స్టర్‌ రోల్‌తో సంజూ బాబా ఈ చిత్రానికి ఆకర్షణగా నిలిచాడు. లుక్కుతోపాటు యాక్షన్‌ పార్ట్‌లోనూ ఖల్‌నాయక్‌ ఆకట్టుకున్నాడు.  ఫుల్లీ యాక్షన్‌ కమ్‌ రొమాంటిక్‌ నేపథ్యంతో కట్‌ చేసిన టీజర్‌ ఆకట్టుకునేలా ఉంది. భూమి తర్వాత సంజయ్‌ దత్‌ నటిస్తున్న చిత్రం కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. జూలై 27న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వార్తలు