మా అమ్మాయి బాగా తీసింది!

11 Dec, 2014 00:50 IST|Sakshi
మా అమ్మాయి బాగా తీసింది!

 ‘‘మా అమ్మాయికి దర్శకత్వం అంటే మొదట్నుంచీ మక్కువ. ఆ ఇష్టంతోనే ఈ సినిమా తీసింది. మా అమ్మాయి అని కాదు కానీ, ఈ సినిమా ఎంతో బాగా తీసింది’’ అని హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ చెప్పారు. ఆయన కుమార్తె శశికిరణ్ దర్శకత్వంలో రూపొందిన ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ ఈ నెల 13న విడుదల కానుంది. దిలీప్‌కుమార్, ప్రియాల్‌గోర్ కాంబినేషన్‌లో డా. సువర్ణ కొల్ల సమర్పణలో డా. కొల్ల నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. శశికిరణ్ మాట్లాడుతూ -‘‘నా కుటుంబం వెన్నుదన్నుతోనే నేనీ స్థాయికి చేరుకున్నా. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరచదు’’ అని అన్నారు. తెలుగుదనం ఉట్టిపడే సినిమా ఇదని నిర్మాత తెలిపారు.