యూత్‌ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌

6 Feb, 2020 05:20 IST|Sakshi
సాయి ధన్సిక

‘కబాలి’ ఫేమ్‌ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రానికి బుధవారం కొబ్బరికాయ కొట్టారు. ఈ చిత్రంతో హరి కొలగాని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ సాయి లక్ష్మీ క్రియేష¯Œ ్స పతాకంపై పి.యస్‌.ఆర్‌ కుమార్‌ (వైజాగ్‌ బాబ్జి) నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. తొలి సన్నివేశానికి నిర్మాత బి.వి.యస్‌. ఎన్‌. ప్రసాద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్‌ క్లాప్‌ ఇచ్చారు. నిర్మాత ‘దిల్‌’ రాజు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. పి.ఎస్‌.ఆర్‌ కుమార్‌ (వైజాగ్‌ బాబ్జి) మాట్లాడుతూ–‘‘డిస్ట్రిబ్యూటర్‌గా తెలుగు సినిమా పరిశ్రమతో నాకు చాలా అనుబంధం ఉంది.

నేను నిర్మాతగా మారడంలో బెక్కం వేణుగోపాల్‌ ప్రోత్సాహం ఎంతో ఉంది’’ అన్నారు. ‘‘శబ్దాలయా, అన్నపూర్ణ సంస్థలలో డైరెక్షన్‌ డిపార్ట్‌ మెంట్‌లో పనిచేశాను. యూత్‌ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌గా రూపొందనున్న చిత్రమిది. ఈ చిత్రం ఫస్ట్‌ షెడ్యూల్‌ నేటి నుంచి ప్రారంభమై ఇరవై రోజుల పాటు హైదరాబాద్‌లో జరుగుతుంది’’ అన్నారు హరి కొలగాని. ‘‘ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాను’’ అన్నారు సాయి ధన్సిక. ఈ చిత్రానికి సమర్పణ: వాగేశ్వరి (పద్మ), కెమెరా: వాస్లి శ్యాం ప్రసాద్, సంగీతం: శేఖర్‌ చంద్ర, సహ నిర్మాతలు: పవన్, సుమన్, లైన్‌ ప్రొడ్యూసర్‌: వెంకట యస్‌కె కులపాక.

మరిన్ని వార్తలు