యోగి ఈజ్‌ బ్యాక్‌

10 Dec, 2018 05:56 IST|Sakshi
సాయిధన్సిక

తెలుగులో ‘యోగి’ అనగానే ప్రభాస్‌ హీరోగా నటించిన చిత్రం గుర్తొస్తుంది. అలాగే రజనీకాంత్‌ ‘కబాలి’ సినిమాలో ‘యోగి’ అనగానే నటి సాయిధన్సిక గుర్తుకురాకమానరు. ఈ పాత్రతో ఆమె కెరీర్‌ నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లిందని చెప్పవచ్చు. ‘కబాలి’లో సాయి ధన్సిక అద్భుతమైన యాక్షన్‌ స్టంట్స్‌ చేశారు. అలాగే ఈ సినిమాలో రజనీకాంత్‌...‘కబాలిదా’ (తెలుగులో ‘కబాలి రా’) అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ఉంటుంది. ఇప్పుడు ఈ డైలాగ్‌ను కొంచెం మార్చి ‘యోగిదా’ అనే టైటిల్‌తో ఓ సినిమా రూపొందనుంది. సాయిధన్సికనే టైటిల్‌ రోల్‌ చేయనున్నారు. టైటిల్‌ అండ్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ఆదివారం రిలీజ్‌ చేశారు. గౌతమ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తారు. జి. అరుణగిరి, చె. రాజ్‌ కుమార్‌ నిర్మాతలు. ‘‘యోగి ఈజ్‌ బ్యాక్‌. సినిమా చిత్రీకరణ నేటి నుంచి మొదలవుతుంది. ప్రముఖ సంగీతదర్శకుడు ఏఆర్‌. రెహమాన్‌ సిస్టర్‌ ఇశ్రత్‌ఖాద్రీ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు’’ అని సాయిధన్సిక పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు