‘ఏజెంట్‌ ఆత్రేయ’కు సుప్రీం హీరో సాయం

18 Jun, 2019 11:45 IST|Sakshi

డిటెక్టివ్‌ డ్రామాగా తెరకెక్కిన ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయకు మంచి స్పందన వస్తోంది. తాజాగా విడుదల చేసిన టీజర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ విడుదలకు సిద్దమైంది. నేటి సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగనుంది.

ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ముఖ్యఅతిథిగా విచ్చేయనున్నారు. నగరంలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో సాయంత్రం 5 గంటలకు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగనుందని నిర్మాతలు తెలిపారు. నవీన్‌ పొలిశెట్టి, శ్రుతీ శర్మ నటించిన ఈ చిత్రాన్ని స్వరూప్‌ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు మార్క్‌ కె. రాబిన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు