‘లంగ్‌ క్యాన్సర్‌.. ఐదు వారాలకు మించి’

4 Dec, 2019 21:36 IST|Sakshi

సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ప్రతిరోజూ పండగే. చాలా రోజుల తరువాత చిత్రలహరి సినిమాతో సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చిన సాయి, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిరోజూ పండగేతో మరో హిట్‌ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. అల్లు అరవింద్‌ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌లు ఫ్యామిలీ ఆడియన్స్‌న్స్‌ను కనెక్ట్‌ చేసేలా ఉన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌. తాజాగా మూవీ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

‘లంగ్‌ క్యాన్సర్‌.. ఐదు వారాలకు మించి బతకడు’అనే హార్ట్‌ టచ్‌ డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌.. అద్యంతం వినోదం, ఉద్వేగభరితంగా సాగింది. ‘పెద్ద కొడుకుగా మీరు కదా కర్మకాండ చేయాల్సింది.. అది రూలే కంపల్‌సరీ కాదు’, ‘మారే కాలంతో పాటూ మనమూ మారాలి, వయసుతో పాటు ఆశలు కూడా చచ్చిపోవాలి’, ‘నీ లవ్‌ స్టోరీని గౌతమ్‌ మీనన్‌లా చిన్న త్రెడ్‌ పట్టుకొని సాగదీయలేము’, ‘లాస్ట్‌ డేస్‌లో కూడా లాజిక్‌లకు తక్కువేం లేదు’వంటి డైలాగ్‌లు అన్ని వర్గాల ప్రజలను కనెక్ట్‌ చేసేలా ఉన్నాయి. సాయి ధరమ్‌ తేజ్‌ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, రావు రమేష్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  డిసెంబర్‌ 20న విడుదల కానున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా