‘డార్లింగ్‌ కాదు తేజ్‌ ఐ లవ్‌ యు’

31 May, 2018 15:47 IST|Sakshi

వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ త్వరలో తేజ్‌ ఐ లవ్‌ యు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రేమకథల స్పెషలిస్ట్‌ కరుణాకరన్ దర‍్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు చిత్రయూనిట్‌.

ఒక్కో పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తూ సినిమా మీద హైప్‌ క్రియేట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజా చిత్రయూనిట్ రిలీజ్ చేసిన ఓ పోస్టర్‌ పై సోషల్‌ మీడియాలో నెగెటివ్‌ కామెంట్స్ వస్తున్నాయి. సాయి ధరమ్‌ తేజ్‌ గిటార్‌ తగిలించుకొని మైక్‌ పట్టుకొని పాట పాడుతున్న స్టిల్‌ ను రిలీజ్ చేశారు అయితే ఈ స్టిల్‌ డార్లింగ్‌ సినిమాలో ప్రభాస్‌ స్టిల్‌ లా ఉందంటు కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్స్‌పై స్పందించిన సాయి ధరమ్‌ ‘కేవలం గిటార్ తగిలించుకొని మైక్‌ పట్టుకున్నంత మాత్రానా డార్లింగ్‌ కాదు.. ఇది తేజ్‌ ఐ లవ్‌ యు’అంటూ కామెంట్‌ చేశాడు.

మరిన్ని వార్తలు