ఫ్లాప్ డైరెక్టర్‌తో సాయి ధరమ్‌ తేజ్‌!

19 Jun, 2019 10:28 IST|Sakshi

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కెరీర్‌ ఆశించిన స్థాయిలో సాగటం లేదు. కెరీర్‌ స్టార్టింగ్‌లో వరుస సినిమాలతో హల్‌చల్‌ చేసిన ఈ సుప్రీం హీరో తరువాత డీలా పడిపోయాడు. వరుస ఫ్లాప్‌లు ఎదురుకావటంతో కెరీర్‌ కష్టాల్లో పడింది. ఇటీవల చిత్రలహరితో కాస్త పరవాలేదనిపించినా సూపర్‌ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు.

ప్రస్తుతం కామెడీ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు సాయి. ఈ సినిమా తరువాత దేవ కట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వెన్నెల, ప్రస్థానం సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న దేవాకట్టా తరువాత ఆటోనగర్‌ సూర్య, డైనమైట్‌ సినిమాలతో డిజాస్టర్లు ఇచ్చాడు. దీంతో చాలా గ్యాప్‌ వచ్చింది.

తాజా దేవ కట్టా సాయి ధరమ్‌కు ఓ లైన్‌ వినిపించాడట. పూర్తి సీరియస్‌ మోడ్‌లో యాక్షన్ డ్రామాగా రూపొందించిన ఈ కథ సాయి ధరమ్‌ తేజ్‌కు  నచ్చటంతో పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయాలని చెప్పాడట. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయితేగాని ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

మరిన్ని వార్తలు