వారాహి వారి రెండు సినిమాలు

11 Sep, 2013 02:06 IST|Sakshi
వారాహి వారి రెండు సినిమాలు
‘ఈగ’, ‘అందాల రాక్షసి’ నిర్మాత సాయి కొర్రపాటి ఒకేసారి రెండు చిత్రాలను నిర్మించబోతున్నారు. ఓ చిత్రం ద్వారా నటుడు అవసరాల శ్రీనివాస్ దర్శకునిగా పరిచయం అవుతుండగా, మరో చిత్రానికి గోగినేని శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్రాల పూజాకార్యక్రమాలు వారాహి సంస్థ కార్యాలయంలో జరిగాయి. 
 
 అవసరాల శ్రీనివాస్ దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రంలో నాగశౌర్య హీరోగా నటించనున్నారు. కల్యాణ్ కోడూరి సంగీత దర్శకుడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని అవసరాల శ్రీనివాస్ చెప్పారు. 
 
 గోగినేని శ్రీనివాస్ దర్శకత్వం వహించే చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని, ఈ చిత్రానికి సిల్లీ మాంక్స్ సినిమా సంస్థ సహ నిర్మాతగా వ్యవహరిస్తుందని నిర్మాత సాయి కొర్రపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్.రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి కుటుంబసభ్యులు, సిల్లీ మాంక్స్ సినిమా సీఈఓ సంజయ్‌రెడ్డి పాల్గొన్నారు.