‘నా కథ విని సాయిపల్లవి ఆశ్చర్యపోయింది’

29 Jul, 2019 07:29 IST|Sakshi

చెన్నై : ఈ కాలంలో మాటకు విలువేలేదని చెప్పవచ్చు. అంతా కృత్రిమం, అవకాశవాదమే. ఈ రోజు సరే అన్న వారు రేపు సారీ అంటున్నారు. సినిమా వాళ్లు ఇందుకు అతీతం కాదు. నటి సాయిపల్లవి ఈ కోవకు చెందినదేనా అనే అనుమానాన్ని ఒక యువ దర్శకుడు వ్యక్తం చేస్తున్నాడు. సాయిపల్లవిని కోలీవుడ్‌కు తీసుకురావడానికి ముందు చాలా మంది దర్శకులు ప్రయత్నించారు. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం కూడా సాయిపల్లవిని తన చిత్రంలో నటింపజేయడానికి ప్రయత్నించి విఫలం అయ్యారనే టాక్‌ అప్పట్లో ప్రచారం అయ్యింది. కాగా ఎట్టకేలకు దర్శకుడు విజయ్‌ ఆమెను దయా చిత్రంతో కోలీవుడ్‌కు తీసుకొచ్చారు. అయితే ఆ చిత్రం ఆమెను పూర్తిగా నిరాశ పరచింది. అంతే కాదు ఆ తరువాత  ధనుష్‌తో రొమాన్స్‌ చేసిన మారి–2, సూర్య సరసన నటించిన ఎన్‌జీకే చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి, దీంతో అక్కడ సాయిపల్లవి దుకాణం బంద్‌ అన్నంతగా మారింది. దీంతో తెలుగు, మాతృభాష మలయాళంలోనే దృష్టి పెట్టింది. అలాంటి ఈ అమ్మడు రామకృష్ణన్‌ అనే యువ దర్శకుడి చిత్రంలో నటించడానికి సాయిపల్లవి మాట ఇచ్చిందట. దర్శకుడు చేరన్‌ శిష్యుడైన రామకృష్ణన్‌ సహాయ దర్శకుడిగా ఉన్న సమయంలోనే హీరోగా అవకాశం రావడంతో కుంకుమపూవే కొంజుం పురావే చిత్రంలో నటించాడు. అలా కొన్నిచిత్రాల్లో నటించిన ఇతను ఇటీవల అవకాశాలు లేక ఖాళీగా ఉన్నాడు.

అయితే తాజాగా దర్శకుడిగా చిత్రం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు అందులో నటి సాయిపల్లవి నటించడానికి అంగీకరించినట్లు చెప్పుచొచ్చాడు. దీని గురించి రామకృష్ణన్‌ తెలుపుతూ.. సాయిపల్లవిని కలిసి కథ వినిపించినట్లూ, కథ విన్న ఆమె ఎన్నాళ్ల నుంచి ఈ కథను తయారు చేస్తున్నారు అని ఆశ్చర్యపోయిందని చెప్పారు. కథ నచ్చిందని, తాను ఈ చిత్రంలో కచ్చితంగా నటిస్తానని చెప్పిందని అన్నారు. ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థనే తనును నటి సాయిపల్లవికి కథ చెప్పమని పంపించిందని దర్శకుడు తెలిపాడు. అయితే కథ బాగుంది, నటిస్తానని చెప్పిన సాయిపల్లవి ఆ తరువాత బిజీ కారణంగా తమ చిత్రానికి కాల్‌షీట్స్‌ కేటాయించలేదని చెప్పారు. కాగా ఒకవేళ తన కథ సాయిపల్లవికి నచ్చలేదా నిజంగానే బిజీ కారణంగా కాల్‌షీట్స్‌ ఇవ్వలేకపోతోందా అన్న సందేహం తనకు కలుగుతోందని దర్శకుడు రామకృష్ణన్‌ అంటున్నాడు. దీనికి సాయిపల్లవే బదులు చెప్పాలి. ఎందుకంటే ఈ అమ్మడికి కోలీవుడ్‌ అచ్చిరాలేదు. పైగా ఐరన్‌ లెగ్‌ అనే ముద్ర కూడా వేసేశారు. ఇలాంటి పరిస్థితుల్లో యువ దర్శకుడిని నమ్మి మరోసారి కోలీవుడ్‌కు వచ్చే సాహసం చేస్తుందా తన మాట నిలబెట్టుకుంటుందా? అన్నది వేచి చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నోరు జారి అడ్డంగా బుక్కైన రష్మీక

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై 

ముహూర్తం కుదిరిందా?

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన తమన్నా

హేమ అవుట్‌.. తమన్నా ఇన్‌

మహిళా అభిమానిని ఓదార్చిన విజయ్‌

జూనియర్‌ నాని తెగ అల్లరి చేస్తున్నాడట

సంపూ డైలాగ్‌.. వరల్డ్‌ రికార్డ్‌

బిగ్‌బాస్‌.. అందుకే హిమజ సేఫ్‌!

బిగ్‌బాస్‌.. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా తమన్నా?

నిఖిల్‌ క్లారిటీ.. సాహో తరువాతే రిలీజ్‌!

ఆడియెన్స్‌ చప్పట్లు కొట్టడం బాధాకరం: చిన్మయి

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు షాక్‌!

బన్నీపై దుష్ప్రచారం : స్పందించిన మెగా టీం

విజయ్‌ దేవరకొండ సినిమా ఆగిపోయిందా?

హీరోకు టైమ్‌ ఫిక్స్‌

నికీషా లక్ష్యం ఏంటో తెలుసా?

ఓ బేబీ షాకిచ్చింది!

‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..

హీరో సూరి

డూప్‌ లేకుండానే...

తొలి అడుగు పూర్తి

నా కామ్రేడ్స్‌ అందరికీ థ్యాంక్స్‌

హాసన్‌ని కాదు శ్రుతీని!

షుగర్‌ కోసం సాహసాలు!

చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షునిగా నారాయణ్‌దాస్‌

గుణ అందరికీ కనెక్ట్‌ అవుతాడు

చయ్య చయ్య.. చిత్రీకరణలో కష్టాలయ్యా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘నా కథ విని సాయిపల్లవి ఆశ్చర్యపోయింది’

నోరు జారి అడ్డంగా బుక్కైన రష్మీక

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై 

ముహూర్తం కుదిరిందా?