నక్సలైట్‌ పాత్రలో సాయి పల్లవి!

27 Jan, 2019 11:16 IST|Sakshi

తన నటనతో, లుక్స్‌తో, డ్యాన్సులతో ప్రేక్షకులను కట్టిపడేస్తారు సాయి పల్లవి. ఏ పాత్ర చేసినా మ్యాజిక్‌ చేసేసి అభిమానులను సంపాదించుకుంటారు. సాయి పల్లవి  ఏదైనా సినిమాలో నటిస్తుంది అని అంటే.. ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ప్రస్తుతం సాయి పల్లవి చేయబోయే ఓ సినిమా అప్‌డేట్‌ ఆసక్తికరంగా మారింది. 

నీదీ నాదీ ఒకే కథతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం 1992 అనే చిత్రం రాబోతోంది. ఈ మూవీలో రానా సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలోనే సాయి పల్లవి నక్సలైట్‌ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. మరి మొదటి చిత్రంతోనే ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు ఈ మూవీ ఎలా తెరకెక్కిస్తాడో వేచి చూడాలి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా