అయ్యో పాపం

17 Jun, 2018 00:07 IST|Sakshi
సాయి ధన్సిక

ఇక్కడి ఫొటోలో ఉన్నది ఎవరో తెలుసుగా! అదేనండీ.. రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘కబాలి’ సినిమాలో యోగి క్యారెక్టర్‌లో రఫ్పాడించిన సాయి ధన్సికనే. ఇంతకీ ఆమె చేతులు, కాళ్లు ఎందుకు కట్టేశారు? అంటే సినిమా కోసం అన్నమాట. ఇంకోమాట.. ఫొటోలో ధన్సిక కూర్చున్నది స్నూకర్‌ టేబుల్‌పైన అని అర్థం అవుతోంది కదూ. పాపం.. అలానే రాత్రంతా కూర్చున్నారట.

సునీల్‌ కుమార్‌ దేశాయ్‌ దర్శకత్వంలో కన్నడలో రూపొందుతున్న ‘ఉద్ఘర్ష’ సినిమాలో ఆమె నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ సీన్‌లో ధన్సిక ఇలా కనిపించనున్నారు. తెలుగు సినిమాలు ‘రోగ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా,  ఆచారి ఆమెరికా యాత్ర’ సినిమాల్లో విలన్‌గా నటించిన అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌ ఈ సినిమాలో ఓ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. అన్నట్లు.. తెలుగులో ధన్సిక స్ట్రయిట్‌ సినిమా ‘వాలుజడ’ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు