నేనూ నెపోటిజమ్‌ బాధితుడినే: సైఫ్‌

3 Jul, 2020 09:32 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం ఇండస్ట్రీలో పాతుకుపోయిన నెపోటిజాన్ని కూకటివేళ్లతో పెకిలించింది. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోడానికి నెపోటిజం కారణామంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. సుశాంత్‌ మరణించి రెండు వారాలు గడుస్తున్నా..ఇంకా అతడి ఆత్మహత్యకు సంబంధించి అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. బాలీవుడ్‌లో ఉన్న వారసత్వ రాజకీయాలపై చర్చ మరింత వేడిని పుట్టిస్తున్న క్రమంలో తాజాగా  బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. (సుశాంత్‌ చావును అవమానిస్తున్నారు: హీరో)

ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైఫ్‌ మాట్లాడుతూ.. తాను కూడా నెపోటిజమ్‌ బాధితుడని పేర్కొన్నాడు. ‘భారత దేశంలో ఉన్న అసమానత్వాన్ని బయట పెట్టాల్సి అవసరం వచ్చింది. నెపోటిజం, అభిమానవాదం రెండు వేరువేరు విషయాలు. సినిమా ఇండస్ట్రీలో నేను కూడా బంధుప్రీతి సమస్యలు ఎదుర్కొన్నాను. కానీ దీని గురించి ఎవరూ మాట్లాడలేదు. ప్రస్తుతం దీనిపై సినిమా పరిశ్రమ నుంచి అనేక మంది చర్చకు రావడం సంతోషంగా ఉంది’. అంటూ పేర్కొన్నాడు. అంతేగాక తన కూతురు సారా అలీ ఖాన్  మొదటి చిత్రం కూడా సుశాంత్ సింగ్‌తో ‘కేదార్‌నాథ్’ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. (స‌డ‌క్‌-2కు సుశాంత్ ఫ్యామిలీ ఝల‌క్‌)

అయితే సైఫ్‌ వ్యాఖ్యలపై అభిమానులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాట్లాడిన అసమానత విషయంపై సైఫ్‌ను అభినందించగా, మరోవైపు నెపోటిజమ్‌పై వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ​ స్థాయిలో మండిపడుతున్నారు. అలనాటి బాలీవుడ్ హీరోయిన్ షర్మిలా ఠాగూర్ కొడుకుగా.. భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌటీ వంటి బ్యాక్ గ్రౌండ్ ఉంది. మన్సూర్ అలీ ఖాన్ ఒక సంస్థానానికి మహారాజు. ఈ క్రమంలో హీరో పటౌడీ వంశాన్ని, వారసత్వాన్ని ప్రస్తావిస్తూ ట్విటర్‌లో వ్యంగ్యంగా మీమ్స్‌ రూపొందిస్తున్నారు. ‘న్యాయం చెప్పే జడ్జే తప్పు చేస్తే మరి న్యాయం ఎవరూ చెప్తారు. 50 రుపాయల చిల్లర యాక్షన్‌. సైఫ్‌ మాత్రమే కాదు. తైమూర్‌ కూడా నెపోటిజమ్‌ బాధితుడే’ అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. (‘సుశాంత్ కోసం త‌న జీవితాన్నే ఇచ్చేసింది’)

మరిన్ని వార్తలు