అమ్మ మాట్లాడిన తీరు చూస్తే భయమేసింది: సైఫ్‌

4 Apr, 2020 13:43 IST|Sakshi

ముంబై : లాక్‌డౌన్‌ నేపథ్యంలో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్ అలీఖాన్‌ ‌, తన భార్య కరీనా కపూర్‌ ఖాన్‌, కొడుకు తైమూర్‌తో కలిసి ముంబైలోని ఇంట్లో ఉంటున్నాడు. లాక్‌డౌన్‌ను సమయాన్ని సైఫ్‌.. తన ముద్దుల కొడుకు తైమూర్‌కు తోట పని నేర్పించడం, కరీనాతో వంట చేయడం వంటి పనులతో బిజీగా గడుపుతున్నాడు. అయితే సైఫ్‌ తన తల్లి, సీనియర్‌ నటి షర్మిలా ఠాగూర్‌ ప్రస్తుతం ఢిల్లీలో ఉంటోంది. దీంతో తన తల్లిని ఎంతగానో మిస్‌ అవుతున్నానని సైఫ్‌ అన్నారు. ఈ క్రమంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైఫ్‌ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ కాలంలో తన తల్లి షర్మిలాతోపాటు సోదరీమణులు(సాబా, సోహా)గురించి తనెంత ఆందోళన చెందుతున్నాడో వివరించాడు. (సైఫ్‌ అలీ ఖాన్‌ ఇంట్లో ఈ పెళ్లి ఇష్టం లేదు..)

"నేను నా తల్లి గురించి ఆందోళన చెందుతున్నాను, కానీ ఆమె చాలా తెలివైనది. ఆమె తన పూర్తి జీవితాన్ని అనుభవించానని. తన జీవితంపై ఎలాంటి విచారం లేదని చెప్పింది. నా తల్లి నుంచి ఇలాంటి మాటలు వినడం, ఆమె మాట్లాడిన తీరు నన్నుభయాందోళనకు గురిచేస్తోంది. అలాగే నా ఇద్దరు సోదరీమణులు సాబా, సోహాను మిస్‌ అవుతున్నాను. ప్రస్తుతం వారిని చూడలేకపోతున్నాను. కానీ మేము తరచుగా ఫోన్‌ కాల్‌ ద్వారా టచ్‌లో ఉంటున్నాం. ఆపద సమయంలో ఉన్నప్పుడు మనం అన్ని, అందరినీ వదులుకోవాల్సి వస్తుంది. అని ఆవేదన వ్యక్తం చేశారు.  అలాగే సైఫ్‌ లాక్‌డౌన్‌ను 19 వ శతాబ్ధపు ఓడతో పోల్చారు. ఓడలో ఉన్నప్పుడు భూమిని దూరం నుంచి చూడొచ్చు. కానీ మీరు నీటిలీ భూమికి మైళ్ల దూరంలో ఉన్నారు. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల మనం దూరంగా ఉ‍న్న కుటుంబ సభ్యులు. స్నేహితులతో దగ్గరగా ఉండటానికి వీలవుతుంది.’’ అంటూ సైఫ్‌ చెప్పుకొచ్చారు. (ఇంగ్లాండ్‌ బోర్డింగ్‌ స్కూల్‌కు తైమూర్‌!)

మరిన్ని వార్తలు