‘కలెక్షన్లు చెప్పినప్పుడు నమ్మలేకపోయాను’

16 Sep, 2018 19:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, అను ఇమ్మాన్యూల్‌ జంటగా డైరక్టర్‌ మారుతి తెరకెక్కించిన శైలజా రెడ్డి అల్లుడు బాక్సాఫీస్‌ వద్ద కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మూడు రోజుల్లో దాదాపు 23  కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇందుకు సంబంధించి చిత్ర బృందం పీపుల్స్‌ బ్లాక్‌బస్టర్‌ పేరిట పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళుతోంది. చిత్ర విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్‌ శనివారం థ్యాంక్స్‌ మీట్‌ ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమంలో నాగ చైతన్య మాట్లాడుతూ.. శైలజా రెడ్డి చిత్రాన్ని ఘనవిజయం చేసినందుకు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మొదట సినిమా కలెక్షన్‌లు చెప్పినప్పుడు నమ్మలేకపోయానని అన్నారు. ఈ సినిమాకు నాకు చాలా కాంప్లిమెంట్స్‌ వచ్చాయని.. అందుకు మారుతికి థ్యాంక్యూ చెప్పాలని అన్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్‌ నటనకు చాలా మంచి కామెంట్స్‌ వస్తున్నాయని పేర్కొన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. శైలజా రెడ్డి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు వాళ్ల సొంతింటి అల్లుడిలా ఆదరిస్తున్నారని తెలిపారు. ఈ సినిమా కలెక్షన్లు మాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయని.. అక్కినేని ఫ్యాన్స్‌ తనకు సూపర్‌ ఎనర్జీ ఇచ్చారని వెల్లడించారు. నాగ చైతన్య, అను, రమ్యకృష్ణ లకు స్పెషల్‌ థ్యాంక్స్‌ తెలిపారు. ఈ సినిమా బాగుందని ఫ్యామిలీల నుంచి ఫోన్లు వస్తున్నాయని అన్నారు. చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అను మాట్లాడుతూ.. ముందు ప్రేక్షకులకు థ్యాంక్స్‌ చెప్పాలని అన్నారు. మారుతికి, నాగచైతన్యకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సినిమా చూడని వాళ్లు థియేటర్‌ వెళ్లి తప్పక సినిమా చూడండి అని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో న‌రేష్‌, పృథ్వీ, సినిమాటోగ్రాఫర్‌ నిజార్‌ షఫీ, నాగవంశీ పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా