రెండో షెడ్యూల్‌ కోసం మీసం తీసిన నరసింహారెడ్డి!

15 Jan, 2018 16:57 IST|Sakshi

ఖైదీ నంబర్ 150తో ఘన విజయం సాధించిన మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రంగా సై రా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా తనయుడు రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. డిసెంబర్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించిన చిత్రయూనిట్, ప్రస్తుతం షూటింగ్ కు గ్యాప్ ఇచ్చింది. 

ఈ సినిమా యూనిట్‌ ఫస్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్‌లో పూర్తి చేసింది. మొదట రెండో షెడ్యూల్ ను రాజస్థాన్ లేదా పొలాచ్చిలో జరపాలని అనుకుంది. కానీ తాజా సమాచారం ప్రకారం సైరా నరసింహారెడ్డి రెండో షెడ్యూల్ ను కేరళలో ప్లాన్ చేశారు. వచ్చేనెల మొదటి వారం నుంచి రెండో షెడ్యూల్ మొదలయ్యే అవకాశం ఉంది.  ఈ షెడ్యూల్ లో నయనతార కూడా పాల్గొననుందన్న టాక్ వినిపిస్తోంది. మ్యూజిక్ డైరక్టర్ పై ఇంకా క్లారిటీ రాలేదు.

రెండో షెడ్యూల్‌లో మెగాస్టార్ కొత్త లుక్ లో కనిపించనున్నారు. చాలా కాలంగా మీసం, గడ్డంతో కనిపిస్తున్న మెగాస్టార్‌ తాజాగా క్లీన్ గా షేవ్ చేసుకొని అభిమానులకు దర్శనమిచ్చారు. జువ్వ సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న చిరు.. గెడ్డం, మీసం లేకుండా కనిపించారు. ఈ గెటప్ తోనే చిరంజీవిపై కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. 

మరిన్ని వార్తలు