పల్లెటూరు నేపథ్యంలో...

23 Sep, 2018 01:13 IST|Sakshi
మేగ్లాముక్త, తనిష్క్‌ రెడ్డి

తనిష్క్‌ రెడ్డి, మేగ్లాముక్త జంటగా శివగణేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సకల కళా వల్లభుడు’. అనిల్‌ కుమార్, కిషోర్, త్రినాథ్, శ్రీకాంత్‌ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్‌ జరుపుకుంటోంది. ‘‘పల్లెటూరు నేపథ్యంలో సాగే యాక్షన్‌ కామెడీ చిత్రమిది. పూర్తి కమర్షియల్‌ హంగులతో ఉంటుంది. హీరో, విలన్‌ మధ్య యాక్షన్‌ సన్నివేశాలు సంక్రాంతి కోళ్ల పందెంలా కనువిందు చేస్తాయి. 30 ఇయర్స్‌ పృథ్వీ చేసిన ఓ మేనరిజమ్‌ ప్రేక్షకుల్లో ట్రెండ్‌ని క్రియేట్‌ చేస్తుంది’’ అన్నారు శివగణేశ్‌. ‘‘కొత్త కథ, కథనాలతో రూపొందిన చిత్రమిది. గీతామాధురి పాడిన ‘తిక్కరేగిన వంకరగాళ్లు’ పాటను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. అజయ్‌ పట్నాయక్‌ సంగీతం, సాయిచరణ్‌ కెమెరా, ధర్మేంద్ర ఎడిటింగ్‌ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు అనిల్‌ కుమార్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు