స్టార్‌ డైరీ

14 Jul, 2020 01:13 IST|Sakshi

అమ్మ కోసం చిరంజీవి అలవోకగా దోసె వేశారు. ఇల్లంతా శుభ్రంగా కడిగిపారేశారు వెంకటేశ్‌. కిచెన్‌లో గిన్నెలు కడిగారు ఎన్టీఆర్‌. మజ్జిగ నుంచి వెన్న ఎలా తీయాలో నానమ్మ దగ్గర నేర్చుకున్నారు రామ్‌చరణ్‌. బెటర్‌హాఫ్‌ సమంత బర్త్‌డే కోసం నాగచైతన్య కేక్‌ చేశారు...  అయితే విడి రోజుల్లో ఇలా చేసేంత సమయం వీళ్లకు ఉండదు గాక ఉండదు. లాక్‌డౌన్‌లో ఇలా రిలాక్స్‌ అవుతున్న స్టార్స్‌ ఒక్కసారి షూటింగ్‌ మొదలుపెడితే ఫుల్‌ బిజీ. ఇక ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొన్న సినిమాలు, సైన్‌ చేసి, పట్టాలెక్కడానికి రెడీగా ఉన్న సినిమాలు, ఫలానా దర్శకుడి సినిమాలో ఫలానా హీరో నటించబోతున్నాడు అని ప్రచారంలో ఉన్న సినిమాలతో ‘స్టార్‌ డైరీ’ మీకోసం...

చిరంజీవి:
చేస్తున్నవి: కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రం
ప్రకటించినవి: త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా, మెహర్‌ రమేష్, సుజిత్, కేఎస్‌ రవీంద్ర (బాబీ) కథలు వినిపించినట్లు ఇటీవల చిరంజీవి వెల్లడించారు.
ప్రచారంలో ఉన్నది: సుజిత్‌ దర్శకత్వంలో చేయబోయేది మలయాళ ‘లూసిఫర్‌’, నాగ్‌ అశ్విన్‌తో సినిమా.

బాలకృష్ణ
చేస్తున్నది: బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా ప్రచారంలో ఉన్నవి:  పూరి జగన్నాథ్, అనిల్‌ రావిపూడిలతో సినిమాలు.

నాగార్జున
చేస్తున్నవి: సాల్మోన్‌ దర్శకత్వంలో ‘వైల్డ్‌డాగ్‌’, హిందీ చిత్రం‘బ్రహ్మాస్త్ర’. ప్రచారంలో ఉన్నది: కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్‌. ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో సినిమా.

వెంకటేష్‌
చేస్తున్నది: శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ‘నారప్ప’ చిత్రం
ప్రచారంలో ఉన్నవి: త్రివిక్రమ్, నక్కిన త్రినాథరావు, అనిల్‌ రావిపూడిలతో సినిమాలు.

రవితేజ
చేస్తున్నది: గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్‌’ ప్రకటించినవి: రమేష్‌వర్మ, వక్కంతం వంశీలతో సినిమాలు
ప్రచారంలో ఉన్నది: సుధీర్‌వర్మతో సినిమా.

పవన్‌ కల్యాణ్‌
చేస్తున్నవి: వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘వకీల్‌సాబ్‌’, క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా.
ప్రకటించినవి: హరీష్‌ శంకర్‌ సినిమా.

మహేశ్‌బాబు
ప్రకటించినవి: పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారు వారి పేట’, రాజమౌళితో సినిమా
ప్రచారంలో ఉన్నవి: కొరటాల శివ, సందీప్‌రెడ్డి వంగా, ప్రశాంత్‌ నీల్‌లతో సినిమాలు.

గోపీచంద్‌
చేస్తున్నది: సంపత్‌ నంది దర్శకత్వంలో ‘సీటీమార్‌’
ప్రకటించినవి: బిను సుబ్రమణ్యం దర్శకత్వంలో ఓ సినిమా.

ప్రభాస్‌
చేస్తున్నది: రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్‌’.
ప్రకటించినవి: నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా.
ప్రచారంలో ఉన్నది: ప్రశాంత్‌ నీల్‌తో సినిమా, బాలీవుడ్‌ దర్శకులు ఓం రౌత్, కబీర్‌ ఖాన్‌లతో సినిమాలు

ఎన్టీఆర్‌
చేస్తున్నది: రాజమౌళి దర్శకత్వంలో ‘రౌద్రం రణం రుధిరం’
ప్రకటించనవి: త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా
ప్రచారంలో ఉన్నది: అట్లీ, ప్రశాంత్‌ నీల్‌లతో సినిమాలు.

అల్లు అర్జున్‌
చేస్తున్నది: సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’
ప్రకటించినవి: వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘ఐకాన్‌’
ప్రచారంలో ఉన్నది: కొరటాల శివ, లింగుస్వామిలతో సినిమాలు.

మంచు విష్ణు
చేస్తున్నది: ‘మోసగాళ్ళు’
ప్రచారంలో ఉన్నది: శ్రీను వైట్ల డైరెక్షన్‌లో ‘ఢీ’కి సీక్వెల్‌గా ‘ఢీ2’.

రామ్‌చరణ్‌
చేస్తున్నది: రాజమౌళి దర్శకత్వంలో ‘రౌద్రం రణం రుధిరం’.
ప్రచారంలో ఉన్నది: ‘ఆచార్య’లో కీ రోల్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, మేర్లపాక గాంధీ, గౌతమ్‌ తిన్ననూరిలతో సినిమాలు

అల్లరి నరేశ్‌
చేస్తున్నది: విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో ‘నాంది’, పి.వి. గిరి దర్శకత్వంలో చేసిన ‘బంగారు బుల్లోడు’ విడుదలకు సిద్ధంగా ఉంది.

నితిన్‌
చేస్తున్నవి: వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘రంగ్‌దే’, చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో ‘చెక్‌’
ప్రకటించినవి: కృష్ణచైతన్య దర్శకత్వంలో ‘పవర్‌పేట’, మేర్లపాక గాంధీ (హిందీ ‘అంధాథూన్‌’ రీమేక్‌).

శర్వానంద్‌
చేస్తున్నవి: కిశోర్‌ దర్శకత్వంలో ‘శ్రీకారం’, శ్రీకార్తిక్‌ దర్శకత్వంలో ఓ సినిమా.

మంచు మనోజ్‌
ప్రకటించిన చిత్రం: ‘అహం బ్రహ్మాస్మి’.

రామ్‌
చేస్తున్నది: కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్‌’
ప్రచారంలో ఉన్నది: సురేందర్‌ రెడ్డి, పూరి జగన్నాథ్‌లతో సినిమాలు

నాని
చేస్తున్నది : శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్‌ జగదీష్‌’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ (షూటింగ్‌ పూర్తయింది)
ప్రకటించినది: రాహుల్‌ సంకృత్యాన్‌తో సినిమా.

నాగచైతన్య
చేస్తున్నది: శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ’
ప్రకటించినది: పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా
ప్రచారంలో ఉన్నది: విక్రమ్‌కుమార్, ఇంద్రగంటి మోహనకృష్ణలతో సినిమాలు.

రానా
చేస్తున్నవి: వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరాటపర్వం’, సాల్మన్‌ దర్శకత్వంలో ‘అరణ్య’ (షూటింగ్‌ పూర్తయింది)
ప్రకటించినవి: గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘హిరణ్యకశ్యప’ చిత్రం, కోడిరామ్మూర్తి బయోపిక్‌
ప్రచారంలో ఉన్నది: సుధీర్‌వర్మతో సినిమా.

వరుణ్‌తేజ్‌
చేస్తున్నది: కిరణ్‌కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా.

అఖిల్‌
చేస్తున్నది: ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’.

సాయిధరమ్‌ తేజ్‌
చేస్తున్నవి: సుబ్బు దర్శకత్వంలో ‘సోలో బ్రతుకే సో బెటర్‌’
ప్రకటించినది: వీరూ పోట్ల దర్శకత్వంలో ఓ సినిమా.

విజయ్‌ దేవరకొండ
చేస్తున్నది: పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘ఫైటర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌)
ప్రకటించినవి: శివనిర్వాణ, ఆనంద్‌ అన్నామళ్లై దర్శకత్వాల్లో సినిమాలు.
ప్రచారంలో ఉన్నది: ఇంద్రగంటి మోహనకృష్ణతో సినిమా.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌
చేస్తున్నది: సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ‘అల్లుడు అదుర్స్‌’.

ఇంకా....
వేణు మల్లాడి దర్శకత్వంలో కల్యాణ్‌ రామ్‌ ఓ సినిమా చేస్తున్నారు. దర్శకుడు వీఐ ఆనంద్‌తో సినిమా చేయబోతున్నారని టాక్‌. ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వంలో ‘కపటధారి’ అనే చిత్రంలో నటిస్తున్నారు హీరో సుమంత్‌. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాలో నటిస్తున్నారు సుశాంత్‌. దీనికి దర్శన్‌ దర్శకుడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఇటీవలే ‘వి’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన సుధీర్‌బాబు.. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కబోయే పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌లో నటించాల్సి ఉంది.

చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ 2’, సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో ‘18 పేజెస్‌’ చిత్రాల్లో నిఖిల్‌ నటించాల్సి ఉంది. కిషన్‌ కట్టా దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ‘శ్వాస’ చిత్రంలో హీరోగా నటించడానికి కూడా గతంలో ఓకే అన్నారు నిఖిల్‌.  రాజ్‌ తరుణ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’ విడుదల కావాల్సి ఉంది. అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు నాగశౌర్య. లక్ష్మీసౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. కౌశిక్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ.

‘అనగనగా దక్షిణాదిలో..’, ‘శబ్దం’ చిత్రాలను నారా రోహిత్‌ అనౌన్స్‌ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘సూపర్‌ మచ్చీ’ చిత్రంలో నటిస్తున్నారు కల్యాణ్‌ దేవ్‌. ఇక కొత్త హీరోలు సాయిధరమ్‌తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ ‘ఉప్పెన’ చిత్రంలో నటిస్తున్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ తమ్ముడు సాయిగణేశ్‌ హీరోగా పవన్‌ సాధినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇంకా అల్లు శిరీష్, శ్రీవిష్ణు తదితర హీరోలు కూడా సినిమాలు కమిట్‌ అయ్యారు. ఇక షూటింగ్స్‌ మొదలుకావడమే ఆలస్యం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు