ఎందరికో జన్మనిచ్చిన 'శివ'

5 Oct, 2014 12:18 IST|Sakshi
జెడి చక్రవర్తి-తనికెళ్ల భరణి-ఉత్తేజ్

అక్కినేని నాగార్జున - అమల జంటగా రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్.ఎస్.క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన 'శివ' చిత్రం ఎందరికో జన్మనిచ్చిందని ఆ చిత్రంలో నటించిన పలువురు చెప్పారు. ట్రెడ్సెట్టర్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదలై 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సాక్షి టీవీ నిర్వహించిన 'శివ 25 ఏళ్లు-స్పెషల్ ఎడిషన్'లో తనికెళ్ల భరణి, జెడి చక్రవర్తి, ఉత్తేజ్ పాల్గొన్నారు. దర్శకుడు శివనాగేశ్వర రావు,  నటుడు, నిర్మాత  చిన్న,  రామ్ జగన్.....మరికొందరు ఫోన్లో మాట్లాడారు. రామ్గోపాల్ వర్మ కూడా ఫోన్లో మాట్లాడారు. శివ నిర్మాణం గురించి డాక్యుమెంటరీ విడుదల చేయబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ చెప్పారు.

స్పెషల్ ఎడిషన్'లో పాల్గొన్నవారందరూ ఆ నాటి శివ సినిమా నిర్మాణ ఘట్టాలను, షూటింగ్, రీరికార్డింగ్ సందర్భంగా జరిగిన విషయాలను, ఈ చిత్రంతో తమ అనుబంధాన్ని, తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.  తాము నటులుగా ఎంపికైన వివరాలు తెలిపారు. ముందు మాటల రచయితగా మాత్రమే ఎంపికైన తనికెళ్ల భరణి, ఆ తరువాత ఆ చిత్రంలో నానాజీ పాత్రకు ఎలా విధంగా పోషించారో తెలిపారు. ఈ మూవీలో బాగా పాపులర్ అయిన సైకిల్ చైన్ ఫైటింగ్ సన్నివేశాన్ని రామ్గోపాల్ వర్మతోపాటు తానుకూడా కలిసి రూపొందించినట్లు జెడి చక్రవర్తి చెప్పారు. తొలుత ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన తాను అనుకోకుండా అందులో యాదగిరి పాత్ర పోషించినట్లు ఉత్తేజ్  చెప్పారు. తమకు కొత్త సినీజీవితాలను ఆ చిత్రం ప్రసాదించినట్లు రామ్ జగన్, చిన్న పేర్కొన్నారు.  తాను పుట్టి 25 ఏళ్లైందని చిన్న సవినయంగా చెప్పారు. తనకు ఈ చిత్రం కొత్త గుర్తింపును ఇచ్చిందని, అందువల్లే దర్శకుడు రాము పేరుతో కలిపి తన పేరును రామ్ జగన్గా మార్చుకున్నట్లు వివరించారు. ఈ స్పెషల్ ఎడిషన్'లో పాల్గొన్నవారు శివ లాంటి చిత్రం ఎవరూ తీయలేరు -  రామూ కూడా తీయలేరు - రామూ తీసినా అంతబాగా తీయలేరు... అని చెప్పారు.

వారు చెప్పిన కొన్ని ముఖమైన విషయాలు:
తొలుత రామ్గోపాల్ వర్మను ఒక్క నాగార్జున మాత్రమే నమ్మారు.
శివ ఇంత హిట్ అవుతుందని అనుకోలేదు.
ఈ సినిమాలో హాస్య సన్నివేశాలను రామూ అసలు అంగీకరించలేదు.
కథనం-ఫొటోగ్రఫీ-మ్యూజిక్-ఫైటింగ్స్-డైలాగ్స్...అన్నీ కొత్తతరహాగానే ఉన్నాయి.
తెలుగు సినిమాకు కొత్త నడక నేర్పింది.
**