సల్మాన్ 'ట్యూబ్ లైట్' ఫస్ట్ లుక్

16 Aug, 2016 11:41 IST|Sakshi
సల్మాన్ 'ట్యూబ్ లైట్' ఫస్ట్ లుక్

వరుస బ్లాక్ బస్టర్లతో సూపర్ ఫాంలో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ట్యూబ్ లైట్. గతంలో సల్మాన్ హీరోగా ఏక్తా టైగర్, భజరంగీ బాయిజాన్ లాంటి సూపర్ హిట్స్ అందించిన కబీర్ ఖాన్, ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం పాకిస్థాన్ బార్డర్లో కీలక సన్నివేశాల షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ను దర్శకుడు కబీర్ ఖాన్ రిలీజ్ చేశారు. సల్మాన్ను వెనకనుంచి తీసిన ఫోటోను తన ఇస్టాగ్రామ్లో పోస్ట్ చేసిన కబీర్ ఖాన్ ఇదే ఫస్ట్ లుక్ అంటూ అభిమానులకు షాక్ ఇచ్చాడు.

టైటిల్ లోగోను కూడా రివీల్ చేయకుండా రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్లో సల్మాన్ ఓ సైనికుడిలా కనిపిస్తున్నాడు. భుజానికి తుపాకి తగిలించుకోని యుద్ధ క్షేత్రంలోకి నడుస్తున్న సోల్జర్లా సల్మాన్ ఆకట్టుకుంటున్నాడు. అయితే ఈ సినిమాలో సల్మాన్ పూర్తి స్థాయి సైనికుడిగా నటిస్తున్నాడా.. లేక ఏదైన కీలక సన్నివేశం కోసం ఈ లుక్లో కనిపిస్తున్నాడా అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ ఏడాది ఈద్కు సుల్తాన్ గా సత్తా చాటిన సల్మాన్ వచ్చే ఏడాది ఈద్ కోసం ట్యూబ్ లైట్ సినిమాను రెడీ చేస్తున్నాడు.