ఈద్‌కి ఫిక్స్‌

8 Jun, 2019 03:33 IST|Sakshi

సల్మాన్‌ఖాన్‌ సినిమాలు రంజాన్‌కు విడుదల అవడం కొత్తేమీ కాదు. ‘వాంటెడ్‌’, ‘దబాంగ్‌’  ‘కిక్‌’, ‘బజరంగీ భాయిజాన్‌’, ‘సుల్తాన్‌’ ‘ట్యూబ్‌లైట్‌’ ‘రేస్‌ 3’.. ఈ ఏడాది ‘భారత్‌’ ఈ చిత్రాలన్నీ ఈ లిస్ట్‌ లోనివే. ఈ క్రమంలో వచ్చే ఏడాది రంజాన్‌కు తన ‘ఇన్‌షా అల్లా’ చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నారు సల్మాన్‌ఖాన్‌. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో సల్మాన్‌ హీరోగా నటించనున్న చిత్రం ‘ఇన్‌షా అల్లా’. ఆలియాభట్‌ కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దాదాపు ఇరవైఏళ్ల తర్వాత సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో నట్తిస్తున్నారు సల్మాన్‌. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’ (1999) సినిమా వచ్చింది.

మరిన్ని వార్తలు