షారూఖ్‌ను ఎత్తుకున్న సల్మాన్‌

14 Jun, 2018 12:57 IST|Sakshi

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ ఖాన్ రెండు రోజులు ముందుగానే పండుగ తీసుకొచ్చాడు. ఈద్‌ కానుకగా కొత్త టీజర్‌ రిలీజ్ చేస్తున్నట్టుగా జీరో మూవీ టీం ముందుగానే ప్రకటించింది. అయితే ఈద్‌ కన్నా రెండు రోజుల ముందే టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. అంతేకాదు అభిమానులకు డబుల్‌ ట్రీట్‌ ఇచ్చారు చిత్రయూనిట్‌. జీరో సినిమాలో సల్మాన్ అతిథి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈద్‌ కానుకగా ఈ ఇద్దరు కలిసి నటించిన సన్నివేశాలకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు.

షారూక్‌, సల్మాన్‌ లు కలిసి ఆడిపాడిన టీజర్‌ అభిమానులను ఖుషీ చేస్తుంది. ఈద్‌ సందర్భంగా ఇద్దరు సోదరులు అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అంటూ టీజర్‌ను ముగించారు. ముఖ్యంగా మరుగుజ్జుగా కనిపిస్తున్న షారూఖ్‌ను ఎత్తుకోవటం, షారూఖ్‌ ప్రేమగా సల్మాన్‌కు ముద్దుపెట్టడం టీజర్‌లో హైలెట్ గా నిలుస్తాయి. ఆనంద్‌ ఎల్‌ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జీరో సినిమాలో కత్రినా కైఫ్‌, అనుష్క శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్టమస్‌ కానుకగా డిసెంబర్‌ నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు