బర్త్‌డే స్పెషల్‌ : కండలవీరుడి తాజా రికార్డ్‌

27 Dec, 2019 10:06 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ 54వ ఏట అడుగుపెట్టడంతో సహ నటులు, అభిమానుల అభినందనల మెసేజ్‌లు సోషల్‌ మీడియాలో వెల్లువెత్తాయి. సల్మాన్‌ తాజా చిత్రం దబాంగ్‌ 3 వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టడంతో బర్త్‌డే రోజున ఆయన అరుదైన రికార్డును సాధించారు. తాజా హిట్‌తో బాక్సాఫీస్‌ వద్ద తనకు తిరుగులేదని సల్మాన్‌ సత్తా చాటారు. సల్మాన్‌ నటించిన 15 సినిమాలు వంద కోట్ల క్లబ్‌లో చేరడంతో బాలీవుడ్‌లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన అత్యధిక సినిమాలు సల్లూ భాయ్‌ ఖాతాలోనే ఉన్నాయి. 2017లో విడుదలైన టైగర్‌ జిందా హై రూ 339 కోట్లు రాబట్టి బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సల్మాన్‌ మూవీగా ముందువరసలో నిలిచింది.

విమర్శకుల నుంచి మిశ్రమ సమీక్షలు దక్కినా బాక్సాఫీస్‌ వసూళ్లలో మాత్రం సల్మాన్‌ సినిమాలు దుమ్మురేపేవి. ఇక సల్లూ భాయ్‌ నటించిన భజ్‌రంగి భాయ్‌జాన్‌, సుల్తాన్‌, కిక్‌, భారత్‌, ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో, ఏక్‌ థా టైగర్‌, రేస్‌ 3, దబాంగ్‌ 2, బాడీగార్డ్‌, దబాంగ్‌, రెడీ, ట్యూబ్‌లైట్‌, జైహో, దబాంగ్‌ 3 సినిమాలు రూ వంద కోట్ల క్లబ్‌లో చోటు దక్కించుకున్నాయి. సల్మాన్‌ తర్వాత రూ 100 కోట్లు సాధించిన అత్యధిక సినిమాలు అక్షయ్‌ కుమార్‌వి కావడం గమనార్హం. ఖిలాడీ నటించిన14 సినిమాలు వంద కోట్ల క్లబ్‌లో చేరాయి. ఆ తర్వాత షారుక్‌ ఖాన్‌ ఏడు చిత్రాలు, అమీర్‌ ఖాన్‌ ఆరు చిత్రాలతో వంద కోట్ల క్లబ్‌లో ముందున్నారు. ఇక ఈ జాబితాలో హృతిక్‌ రోషన్‌, అజయ్‌ దేవ్‌గన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, రణ్‌బీర్‌ కపూర్‌లు తర్వాతి స్ధానాల్లో నిలిచారు. పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నా దబాంగ్‌ 3 వసూళ్లు నిలకడగా సాగడం గమనార్హం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా