నా సొంత పగ అంటున్న సల్మాన్‌

23 Oct, 2019 19:47 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దబాంగ్‌ 3. ఇప్పటికే ఈ సీరిస్‌లో రెండు విజయవంతమైన చిత్రాలను సల్మాన్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దబాంగ్‌ 3కి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. మూడు నిమిషాలు సాగిన ఈ ట్రైలర్‌లో.. ప్రజెంట్‌, ప్లాష్‌బ్యాక్‌ పాత్రల్లో సల్మాన్‌ తనదైన నటనను కనబరిచారు. సోనాక్షి సల్మాన్‌ భార్యగా నటిస్తుండగా.. ప్లాష్‌బ్యాక్‌లో సయీ మంజ్రేకర్‌తో ఆయన ఆడిపాడనున్నారు. కామెడీతోపాటు, ఎమోషన్స్‌తో కూడిన ఈ ట్రైలర్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చుల్‌బుల్‌ పాండేగా మరోసారి సల్మాన్‌ మ్యాజిక్‌ క్రియేట్‌ చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు.

దబాంగ్‌ మొదటి రెండు బాగాల్లో కనిపించిన అర్బాజ్‌ఖాన్‌, మహీగిల్‌ తమ పాత్రలను నిలుపుకోగా, కన్నడ సూపర్‌స్టార్‌ కిచ్చా సుదీప్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్నాడు. డిసెంబర్‌ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమా హిందీతో పాటు తమిళ్‌, తెలుగు, కన్నడ భాషల్లోనూ విడుదల కానుంది. ఇప్పటికే సల్మాన్‌కు వాంటెడ్‌(పోకిరి రీమేక్‌)తో విజయాన్ని అందించిన ప్రభుదేవా.. దబాంగ్‌ 3తో మరో హిట్‌ను అందిస్తారని అంతా భావిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ప్రభుదేవా మరోసారి సల్మాన్‌ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కొరియన్‌ చిత్రం ‘ద అవుట్‌ లాస్‌’ చిత్రానికి ఇది హిందీ రీమేక్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా