నిజంగానే గ‌డ్డి తిన్న స‌ల్మాన్‌

10 Apr, 2020 17:14 IST|Sakshi

బాలీవుడ్ భాయ్‌జాన్ స‌ల్మాన్ ఖాన్ గ‌డ్డి తిన్నాడు. విన‌డానికి వింత‌గా ఉన్నా, న‌మ్మ‌శక్యంగా లేక‌పోయినా ఇదే నిజం. వివ‌రాల్లోకి వెళితే.. మేన‌ల్లుడు నిర్వాన్ ఖాన్‌తో క‌లిసి స‌ల్మాన్‌ ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు. తీరా లాక్‌డౌన్ ప్ర‌క‌టించడంతో అక్క‌డే చిక్కుకుపోయాడు. ఎక్క‌డికీ వెళ్ల‌డానికి వీలు లేక‌పోవ‌డంతో ఫామ్ హౌస్‌లోనే తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే అక్క‌డ అత‌నికి గుర్రాలు కూడా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం ఉద‌యం ఆయ‌న స‌ర‌దాగా గుర్రం ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు. దానికి గ‌డ్డి తినిపించ‌డానికి ముందు అత‌ను నోటిలో వేసుకుని నమిలాడు. త‌ర్వాత దాని నోటికాడికి అందించి తినిపించాడు.

ఇది చూసిన‌ హీరో మేన‌ల్లుడు న‌వ్వు ఆపుకోలేక‌పోయాడు. దీనికి సంబంధించిన వీడియోను స‌ల్మాన్ "బ్రేక్‌ఫాస్ట్ విత్ మై ల‌వ్" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీనిపై నెటిజ‌న్లు ఫ‌న్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి తుంట‌రి ప‌నులు చేయ‌డం స‌ల్మాన్‌కు అలవాటేన‌ని చెప్పుకొస్తున్నారు. చూడ‌టానికి ఎంత క్యూట్‌గా ఉందోన‌ని ఆయ‌న అభిమాని కామెంట్ చేశాడు. కాగా క‌రోనా వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ 25 వేల‌మందికి స‌ల్మాన్‌ ఆర్థిక సాయం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అందులో భాగంగా తొలి విడ‌త‌లో వారంద‌రి ఖాతాల్లో రూ.3 వేల చొప్పున జ‌మ చేశారు. (సల్మాన్‌ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్‌ మృతి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా