సల్మాన్ షూటింగ్కు ఊహించని అతిథి

30 Apr, 2015 09:41 IST|Sakshi
సల్మాన్ షూటింగ్కు ఊహించని అతిథి

కాశ్మీర్: అసలే ఎండాకాలం.. కానీ అక్కడ మాత్రం అలా అనిపించకపోవచ్చు. ఎందుకంటే అది మంచు ప్రాంతం. కాశ్మీర్ మిగతా ప్రాంతాలకన్నా ఎప్పటికీ ఆహ్లాదంగానే ఉంటుంది కూడా. కానీ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు మాత్రం కాస్త చిరాకుగా, ఒత్తిడిగా అనిపించింది. అలా అనిపించేలోపే తిరిగి గాల్లో తేలిపోయినట్లు ఒక్కసారిగా లేచి నిల్చున్నారు. ముఖంలో చిరునవ్వు. ఒత్తిడి మాయం. ఇదంతా ఎందుకని అనుకుంటున్నారా..!

ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తూ కబీర్ ఖాన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం బజ్రంగి భైజాన్ కాశ్మీర్ లోయలో షూటింగ్ జరుపుకుంటోంది. చుట్టూ నటీనటులు, కెమెరాలు, మైక్ సౌండ్లతో కాస్తంత అలసి పోయిన సల్మాన్ వెంటనే రిలీఫ్ అయ్యారు. అందుకు కారణం ఆయన గారాల చెల్లెలు అర్పిత, బావ అయూష్ శర్మ అనుకోకుండా షూటింగ్ వద్దకు వచ్చారంట. దీంతో ఒక్కసారిగా తన కుటుంబ సభ్యులు కనిపించడంతోపాటు తాను ఎంతగానో ఇష్టపడే సోదరి అర్పిత ఊహించకుండా వచ్చేసరికి ఆయన ఒక్కసారిగా సంతోషంలో మునిగిపోయారని, అక్కడ చిరునవ్వులు విరబూసాయని అర్పిత ట్వీట్ చేసింది.