ఇంటర్‌నెట్‌ సెన్సేషన్‌కు సల్మాన్‌ భారీ గిఫ్ట్‌!

28 Aug, 2019 12:11 IST|Sakshi

సోషల్ మీడియా అభివృద్ధి చెందుతుండటంతో గుర్తింపుకు నోచుకోని ఎంతో మంది కళాకారులు వెలుగులోకి వస్తున్నారు. ఇటీవల తెలుగులో బేబీ అనే గాయని సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ లోనూ ఇలాగే ఓ గాయని తెర మీదకు వచ్చారు. రణు మొండాల్ అనే మహిళ రైల్వే స్టేషన్‌లో పాటలు పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆమె గాత్రం లెజెండరీ సింగర్‌ లతా మంగేష్కర్‌ను పోలి ఉండటంతో పలువురు ప్రముఖులు ఆ వీడియోపై స్పందించారు. అంతేకాదు నటుడు, సంగీత దర్శకుడు హిమేష్‌ రేష్మియా తన తదుపరి సినిమా ‘హ్యాపీ హార్డీ అండ్‌ హీర్‌’లో ఆమెకు పాట పాడే అవకాశం ఇచ్చాడు. నిన్నటి వరకు ఎలాంటి గుర్తింపు లేకుండా రైల్వే స్టేషన్‌లో గడిపిన ఆమె ఇప్పుడు ఒక్కసారి బాలీవుడ్ సెలబ్రిటీగా మారిపోయారు. ఈ విషయం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ వరకు చేరటంతో ఆయన స్పందించారు.

తనకు నచ్చిన వారికి విలువైన బహుమతులు ఇవ్వటంలో సల్మాన్‌కు ఎవరూ పోటీరారు. ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు సల్లూ భాయ్‌. రణు మొండాల్ గాత్రాన్ని మెచ్చి ఆమెకు ఏకంగా 55 లక్షల విలువైన ఇంటిని కానుకగా ఇచ్చాడట. అంతేకాదు తన తాజా చిత్రం దబాంగ్ 3లో పాట పాడే అవకాశం కూడా ఇస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై సల్మాన్‌ గానీ అతని పీఆర్ టీం గానీ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘తూనీగ’ ప్రోమో సాంగ్ విడుద‌ల

‘మా రైటర్స్‌ ప్రపంచం అంటే ఇంతే’

మురికివాడలో పాయల్‌ రాజ్‌పుత్‌

‘ఆ తుపాను ముందు వ్యక్తి ఇతనే’

నవిష్క అన్నప్రాసనకు పవన్‌ కల్యాణ్‌ భార్య

అర్జున్‌ మేనల్లుడి పొగరు

తరగతులకు వేళాయె!

నెయిల్‌ పాలిష్‌... మస్త్‌ ఖుష్‌

బేబీ బాయ్‌కి జన్మనివ్వబోతున్నాను

మా ఆయుధం స్వార్థత్యాగం

క్లాష్‌ వస్తే నిర్మాతలే నష్టపోతున్నారు

విక్రమ్‌ ఓకే.. వేదా ఎవరు?

బిగ్‌బాస్‌.. ఆ ముగ్గురికి షాక్‌

అలియా భట్‌ ఎవరో తెలియదన్న మాజీ క్రికెటర్‌

భార్యాభర్తల మధ్య గొడవ సీక్రెట్‌ టాస్క్‌లో భాగమా?

‘తలుపులు మూయడానికి ఒప్పుకోలేదు’

బిగ్‌బాస్‌.. మహేష్‌ స్ట్రాటజీపై కామెంట్స్‌

బిగ్‌బాస్‌.. ఏయ్‌ సరిగా మాట్లాడురా అంటూ అలీ ఫైర్‌

సెప్టెంబర్ 6న ‘ఉండి పోరాదే’

‘ప్రభుత్వం నల్లమల అడవుల్ని కాపాడాలి’

‘నా రక్తంలో సానుకూలత పరుగులు తీస్తోంది’

‘బాహుబలి నా ముందు మోకాళ్లపై!’

వెనక్కి తగ్గిన ‘వాల్మీకి’!

సెప్టెంబర్ 8న ‘సినీ రథసారథుల రజతోత్సవం’

పాటల తోటలో ఒంటరి సేద్యం!

గురుశిష్యుల మధ్య ‘వార్‌’

పురుగులున్న ఫుడ్‌ పంపారు : నటి ఆగ్రహం

‘ఇక్కడ రచయితలకు గౌరవం లేదు’

ప్రేమ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు

విజయ్‌ వర్సెస్‌ విజయ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మురికివాడలో పాయల్‌ రాజ్‌పుత్‌

అర్జున్‌ మేనల్లుడి పొగరు

తరగతులకు వేళాయె!

నెయిల్‌ పాలిష్‌... మస్త్‌ ఖుష్‌

బేబీ బాయ్‌కి జన్మనివ్వబోతున్నాను

మా ఆయుధం స్వార్థత్యాగం