ముద్దంటే చేదే!

4 Jun, 2019 06:01 IST|Sakshi
సల్మాన్‌ ఖాన్‌

‘ముద్దు సన్నివేశాల్లో నటించడం నాకు అసౌకర్యంగా ఉంటుంది’’ అంటున్నారు సల్మాన్‌ ఖాన్‌.  ఆయన హీరోగా, కత్రినాకైఫ్, దిశా పటానీ హీరోయిన్లుగా రూపొందిన ‘భారత్‌’ ఈ నెల 5న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న సల్మాన్‌ను ‘మీరు ముద్దు సీన్లలో ఎందుకు నటించరు?’ అని అడిగిన మీడియాతో– ‘‘ఇప్పుడు ట్రెండ్‌ మారింది. లిప్‌లాక్, రొమాంటిక్‌ సన్నివేశాలను సాధారణంగా తీసుకుంటున్నారు. అయినప్పటికీ అలాంటి సన్నివేశాలు నాకు అసౌకర్యంగా అనిపిస్తాయి. మనం ఫ్యామిలీతో సినిమా చూస్తున్నప్పుడు ముద్దు సీన్‌ వస్తే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. నా సినిమా అంటే మొత్తం కలిసి చూసేలా ఉండాలి. రొమాంటిక్‌ సీన్లలో చేయమని కొందరు దర్శకులు అడిగితే కుదరదని చెప్పేశా. ‘మైనే ప్యార్‌ కియా’ (1989) సినిమాలో వచ్చిన రొమాంటిక్‌ సన్నివేశాలు నేను నేరుగా చేసినవి కావు. ఆ టైమ్‌లోనే అలాంటి సీన్లు చేయలేదు.. ఇప్పుడెందుకు ఒప్పుకుంటా?’’ అన్నారు. 

మరిన్ని వార్తలు