ఆమిర్‌... నువ్వంటే ద్వేషం!

23 Dec, 2016 23:06 IST|Sakshi
ఆమిర్‌... నువ్వంటే ద్వేషం!

సల్మాన్‌! నీ ‘ద్వేషం’లో నేను ‘ప్రేమ’నే చూశా. నిన్ను ద్వేషిస్తున్నంతగానే... ప్రేమిస్తున్నాను – ఆమిర్‌

యాభై ఏళ్ల వయసులో బాడీ మేకోవర్‌ అంటే మామూలు విషయం కాదు. అందుకు ఎంతో కృషి, తపన ఉంటేగానీ సాధ్యం కాదు. అయితే బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్, ఆమిర్‌ఖాన్‌ యాభైఏళ్లలోనూ బాడీ మేకోవర్‌ చేసి అందర్నీ ఔరా! అనిపించారు. సల్మాన్, ఆమిర్‌ మల్లయోధులుగా చిత్రాలు ప్రకటించినప్పటి నుంచే వాళ్ల ఫిజిక్, పెర్ఫార్మెన్స్‌పై అంచనాలు నెలకొన్నాయి. సల్మాన్‌ ‘సుల్తాన్‌’ విడుదలై ఘనవిజయం సాధించి మాంచి వసూళ్లు రాబట్టింది. ‘సల్మాన్‌ సూపర్‌’ అని అందరూ అన్నారు.

ఇప్పుడు విడుదలైన ఆమిర్‌ ‘దంగల్‌’ చిత్రం కూడా సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆమిర్‌ మేకోవర్‌కి ప్రశంసలు లభిస్తున్నాయి. అభినందించిన వాళ్లల్లో సల్మాన్‌ కూడా ఉన్నారు. ‘‘నా ఫ్యామిలీతో కలిసి ‘దంగల్‌’ చూశా. ‘సుల్తాన్‌’ కన్నా ఇదే బాగుందన్నారు. ఆమిర్‌.. వ్యక్తిగతంగా నువ్వంటే ఇష్టం. అయితే వృత్తిపరంగా మాత్రం ద్వేషం’’ అని సల్మాన్‌ సరదాగా చమత్కరించారు. సల్మాన్‌ చేసిన ఫన్నీ ట్వీట్‌కి అంతే ఫన్నీగా ఆమిర్‌ కూడా ట్విట్టర్‌ ద్వారా పై విధంగా సమాధానం ఇచ్చారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి