‘ఇది నిజమేనా.. నన్నెవరైనా నిద్ర లేపండి’

18 Jan, 2019 10:59 IST|Sakshi

తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన కన్నడ స్టార్ సుధీప్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం పహిల్వాన్‌. సుధీప్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ అయిన టీజర్ ఆ అంచనాలను మరింతగా పెంచేసింది. ఈ టీజర్‌కు బాలీవుడ్, కోలీవుడ్‌ల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా సల్మాన్‌ పహిల్వాన్‌ టీజర్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేయటంతో సుధీప్‌ స్పందిస్తూ ‘సార్‌.. ఇది నిజమేనా.. నన్నెవరైనా నిద్ర లేపండి. సుల్తాన్ ట్వీట్ చేశారు. థాంక్యూ’ అంటూ కామెంట్ చేశారు.

అంతేకాదు టీజర్‌ను ప్రంశసిస్తూ ట్వీట్‌ చేసిన ప్రతీ ఒక్కరికి సుధీప్‌ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, రితేష్‌ దేశ్‌ముఖ్‌లతో పాటు ధనుష్‌, రవి కిషన్‌, రామ్‌ గోపాల్‌ వర్మ లాంటి స్టార్స్‌ పహిల్వాన్ టీజర్‌పై ప్రశంసలు కురింపించారు. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మళ్ళీరావా ఫేం ఆకాంక్ష సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు