సల్మాన్‌ వేట మొదలైంది..!

13 Jun, 2018 10:39 IST|Sakshi

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం రేస్‌ 3. ఘనవిజయం సాధించిన రేస్‌ సిరీస్‌లో మూడో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రెమో డిసౌజా దర్శకుడు. హాలీవుడ్‌ స్థాయి యాక్షన్‌ ఎపిసోడ్స్‌ తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో రేస్‌ 3 సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే దంగల్‌ పేరిట ఉన్న శాటిలైట్‌ రైట్స్ రికార్డ్‌ను రేస్‌ 3 బద్ధలు కొట్టింది. దీంతో రిలీజ్‌ కు ముందే సల్మాన్ రికార్డ్ ల వేట మొదలైందంటున్నారు ఫ్యాన్స్‌.

ఆమిర్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన దంగల్‌ చిత్ర శాటిలైట్‌ రైట్స్‌ 120 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇప్పుడు సల్మాన్ హీరోగా నటించిన రేస్‌ 3 శాటిలైట్‌ రైట్స్‌ ఏకంగా 130 కోట్లు పలికినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించలేదు. అదే సమయంలో మీడియాలో వస్తున్న వార్తలను ఖండించలేదు. దీంతో ఆమిర్‌ రికార్డ్‌ను సల్మాన్‌ బద్ధలు కొట్టాడంటూ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.

సల్మాన్‌ కు ఈద్‌ బరిలో సూపర్‌ హిట్ రికార్డ్‌ ఉంది. అందుకే రేస్‌ 3 చిత్రాన్ని కూడా రంజాన్‌ కానుకగా జూన్‌ 15న రిలీజ్ చేస్తున్నారు. జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌, అనిల్‌ కపూర్‌, బాబీడియోల్‌, సాకిబ్‌ సలీమ్‌, డైసీషా ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సల్మాన్‌ ఖాన్‌, రమేష్‌ తౌరాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా