ఆ సినిమాకు కలెక్షన్ల సునామీ

17 Jun, 2018 16:02 IST|Sakshi

సాక్షి, ముంబై : ‘ఇస్‌ రేస్‌ కా సికిందర్‌ మై హూ’ (ఈ రేసులో విజేతను నేనే)’  అంటూ రేస్‌ 3 సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ చెప్పినట్లుగానే బాక్సాఫీస్‌ వద్ద తానే విజేతనని మరోసారి రుజువు చేసుకుంటున్నారు. సల్మాన్‌ ‘ఈద్‌’ సెంటిమెంట్‌ను రిపీట్‌ చేస్తూ... శుక్రవారం విడుదలైన రేస్‌ 3 బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజే 29.17 కోట్ల రూపాయలు వసూలు చేసి 2018 బిగ్గెస్ట్‌ ఓపెనర్‌గా నిలిచింది. అంతేకాకుండా సల్మాన్‌ కెరీర్‌లో.. మొదటి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన మూడో సినిమాగా(సుల్తాన్‌ 36.54 కోట్లు, ఏక్‌ థా టైగర్‌ 32.93 కోట్లు) గుర్తింపు దక్కించుకుంది.

విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన ఎదుర్కొన్నప్పటికీ ఆదివారం నాటికి 67.31 కోట్ల రూపాయలు వసూలు చేసిన రేస్‌ 3 సల్మాన్‌ సత్తా ఏమిటో నిరూపించింది. విడుదలైన రెండు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా కూడా రికార్డు సృష్టించింది. మరో వారం రోజుల పాటు పెద్ద సినిమాలేవీ రిలీజ్‌ అయ్యే అవకాశం లేకపోవడంతో రేస్‌ 3 భారీ వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతుందని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.

రేస్‌ సిరీస్‌లో మూడో భాగంగా రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సల్మాన్‌ ఖాన్‌, రమేష్‌ తౌరాని సంయుక్తంగా నిర్మించారు. సల్మాన్‌ ఖాన్‌, అనిల్‌ కపూర్, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌, బాబీడియోల్‌, సాకిబ్‌ సలీమ్‌, డైసీషా ప్రధాన పాత్రల్లో నటించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా